నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన భగవంత్ కేసరి చిత్రం సూపర్ హిట్ అవ్వడమే కాదు.. ఏకంగా బాలయ్య కు ఈ చిత్రం తో నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అయితే ఈ చిత్రాన్ని తమిళంలో హీరో విజయ్ రీమేక్ చేస్తున్నారని విజయ్ జన నాయగన్ ని దర్శకుడు హెచ్ వినోద్ స్టార్ట్ చేసినప్పటినుంచి ప్రచారం జరుగుతుంది. కానీ వినోద్, అనిల్ రావిపూడి, మేకర్స్ ఏ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
కానీ జాన్ నాయగన్ ట్రైలర్ తో భగవంత్ కేసరికి రీమేక్ అనేది స్పష్టమైంది. ఇప్పుడు జన నాయగన్ భగవంత్ కేసరికి రీమేక్ అనేది క్లారిటీ రాగా.. నందమూరి అభిమానులు హీరో విజయ్ బాలయ్యను మ్యాచ్ చేసారా ఆంటూ భూతద్దం పెట్టి మరీ జన నాయగన్ ట్రైలర్ ని వెతికేస్తున్నారు. భగవంత్ కేసరిలోని ఫ్యాక్టరీ ఫైట్ తో మొదలుపెట్టి జైలు ఎపిసోడ్ దాకా జన నాయగన్ లో మక్కికి మక్కి దించేశారు.
ట్రైలర్ సెకండ్ హాఫ్ లో పొలిటికల్ సెటప్ తప్ప చాలావరకు భగవంత్ కేసరికి పోలికలున్నాయి. హీరో విజయ్ మాత్రం బాలయ్య పవర్ ఫుల్ కేరెక్టర్ ని మ్యాచ్ చెయ్యలేదు, భారీ బడ్జెట్, పొలిటికల్ గా అదనపు మెరుగులు చూస్తే తప్ప ఏ విధంగానూ విజయ్ బాలయ్య ను మ్యాచ్ చెయ్యలేదు అనే మాత్రం సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్స్ తో సహా బాలయ్య అభిమానులు షేర్ చేస్తున్నారు.