ది రాజసాబ్ ఇప్పుడు ఇదే మీడియాలో కనిపిస్తున్న సినిమా. సంక్రాంతి రేస్ లో జనవరి 9 న ఆడియన్స్ ముందుకు రాబోతున్న ది రాజాసాబ్ పై మంచి అంచనాలున్నాయి. రీలీజ్ ట్రైలర్ తోనే సినిమాపై అంచనాలు క్రియేట్ చేసిన దర్శకుడు మారుతి సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నాడు. జోనర్ మార్చి, పాన్ ఇండియా లెవల్ తగ్గించుకుని ప్రభాస్ చేసిన రాజసాబ్ కి ఆయన పారితోషికం ఎంత తీసుకున్నారనే విషయంలో అందరిలో విపరీతమైన క్యూరియాసిటీ ఉంది.
ప్రభాస్ రేంజ్ రూ.150 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారు. కానీ రాజసాబ్ కోసం ప్రభాస్ రూ.100 కోట్ల పారితోషికం తీసుకున్నారని.. జోనర్ మర్చి, స్టోరీ నచ్చి ప్రభాస్ ఈ పారితోషికానికి ఓకే అన్నారని తెలుస్తుంది. దర్శకుడు మారుతి రాజసాబ్ కి హైయ్యెస్ట్ పారితోషికం అంటే రూ.18 కోట్లు వరకు అందుకున్నారని తెలుస్తుంది. ప్రభాస్ తాతయ్య పాత్రలో నటిస్తున్న సంజయ్ దత్ ఈ సినిమాకు గాను రూ.5 నుంచి రూ.6 కోట్ల వరకు పారితోషికం అందుకున్నారని సమాచారం.
ప్రభాస్ సరసన నటించిన ముగ్గురు హీరోయిన్లు లో మాళవిక మోహనన్ కి రూ.2 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చిన మేకర్స్ మరో హీరోయిన్ నిధి అగర్వాల్ రూ.1.5 కోట్లు, రిద్ధి కుమార్ సుమారు రూ.3 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఈ సినిమా కోసం సుమారు రూ.1 కోటి పారితోషికం తీసుకున్నారనే టాక్ వినబడుతుంది.