బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల సక్సెస్ ను తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. సక్సెస్ సెలెబ్రేషన్స్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, ఫ్యాన్స్ అంటూ హంగామా చేస్తున్నాడు. స్టార్ మా పరివార్ లోను పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఎక్కడ చూసినా కళ్యాణ్ పడాల నే. ఫ్యాన్స్ మధ్యలో డాన్స్ లు చేస్తూ తెగ హడావిడి చేస్తున్నాడు.
మరి ఈ జోరు ఎన్నాళ్ళు కళ్యాణ్ పడాలా అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఫ్యాన్స్ వల్లే గెలిచానంటూ వారిని కలుస్తున్నావు, నువ్వు తెరపైకి వస్తే వాళ్ళు మళ్లీ సపోర్ట్ చేస్తారా అంటున్నారు. కళ్యాణ్ పడాల కూడా న్యూ ఇయర్ విషెస్ చెబుతూ గత ఏడాది తనని సపోర్ట్ చేసారు, ఎప్పుడు చెయ్యాలని కోరుకున్నాడు.
మరి కళ్యాణ్ పడాల ఆర్మీని వదిలేసి ఇక అవకాశాల కోసం తిరుగుతాడేమో, ఇప్పటివరకు బిగ్ బాస్ విన్నర్స్ ఏం సాధించారో, దీనికి మించి కళ్యాణ్ పడాల ఎదగలడా అనే సందేహాలు చాలామందిలో నడుస్తున్నాయి. చూద్దాం కళ్యాణ్ పడాల జోరు ఎన్నాళ్ళో అనేది.