ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఫేమస్ అయ్యేందుకు ఎలాంటి కామెంట్స్ అయినా చేస్తారు, ఆయన చెప్పిన కొన్ని జాతకాలు నిజమయ్యేసరికి ఆయన చెప్పినవన్ని జరుగుతాయని పప్పులో కాలేశారు, ట్రోల్ అయ్యారు, మీ ట్రోల్స్ వల్లే హీరో అయ్యాను అంటాడు, నా వల్లే ప్రగతి గోల్డ్ మెడల్ సాధించింది అంటాడు, నా పూజలు వల్లే హీరోయిన్స్ స్టార్ పొజిషన్ కి వెళ్లారు అంటాడు. తాజాగా నటి ప్రగతి నా క్రమశిక్షణ, నా ప్రాక్టీస్ వల్లే నేను మెడల్ సాధించాను, అదేదో వేణు స్వామి పూజలు వల్ల కాదు అని కుండబద్దలు కొట్టింది.
తాజాగా మరో హీరోయిన్ డింపుల్ హయ్యాతి కూడా వేణు స్వామిపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. వేణు స్వామి తో ఆమె పూజలు చేయించుకోవడమేకాదు ఆ పూజలు, వైన్ బాటిల్ పెట్టి పూజ చేసినట్లుగా లీకైన ఫొటోస్ అప్పట్లో సంచలనం అయ్యాయి. అదే విషయాన్ని డింపుల్ హయ్యాతి భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రమోషన్స్ లో అడిగితే.. దానికి డింపుల్ హయ్యాతి మేము దేవుడి కోసం గుడులకు వెళ్తాము, అక్కడ ఆ పూజలు చేస్తే మంచిది, ఈపూజలు చేస్తే మంచి అంటే నమ్మాను.
మా పేరెంట్స్ చెబితే చేశాను, పేరెంట్స్ మంచి చెబితే చేస్తాం కదా, ఎవరో చెబితే, ఎవరూ స్టార్ అయిపోరు, దేవుడు ఇలా ఉంటాడు, అలా ఉంటాడు అని నేను నమ్మను.. అంటూ డింపుల్ హయ్యాతి వేణు స్వామిపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.