మాలీవుడ్ చిత్రం `ది కేరళ స్టోరీ` రిలీజ్ సమయంలో? ఎలాంటి వివాదాలు ఎదుర్కుందో తెలిసిందే. సరిగ్గా రిలీజ్ కు వారం ముందు సినిమాను బ్యాన్ చేయాలని..రిలీజ్ కు అనుమతి ఇవ్వకూడదంటూ కేరళలో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. అధికార పక్షం సహా విపక్షం కూడా ఒకే తాటిపైకి వచ్చి రిలీజ్ పై అభ్యంతరాలు వ్యక్తం చేసాయి.మతం పేరుతో కేరళ రాష్ట్రాన్ని ప్రపంచం దృష్టిలో చెడ్డగా చిత్రీకరిస్తున్నారు? అన్నది ఆరోపణ కావడంతో?
ఈ వివాదం సుప్రీంకోర్టుకు వెళ్లింది.
చివరికి ఎలోగూ అన్ని అవాంతరాలు దాటుకుని ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ సినిమాకు పార్ట్ 2 కూడా ఉందని..సైలెంట్ గా ఆ సినిమా షూటింగ్ కూడా పూర్తయిందన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవ రిలో చిత్రాన్ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సిద్దమవుతున్నట్లు తెలిసింది. వాస్తవానికి `ది కేరళ స్టోరీ` టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచే వివాదం మొదలైంది. ఆ తర్వాత ట్రైలర్ తో రాష్ట్రమంతా భగ్గు మంది.
కేరళలో కొన్నేళ్లుగా 30 వేల మంది మహిళలు అదృశ్యమైనట్లు వస్తున్న ఆరోపణలకు సంబంధించి వారి ఆచూకీ ఎక్కడా? అనే కథాంశంతో కేరళ స్టోరీ రూపొందించారు. ఓ నలుగురు యువతులు మతం మారి, ఐసిస్‌లో చేరిన నేపథ్యంతో కథ సాగుతుంది. ఇదే వివాదానికి దారి తీసిన అంశం. ఆ నలుగురు యువతులు భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాల కోసం పని చేస్తున్నారనే కోణంలో చూపించడం వివాదానికి దారితీసింది.
మతసామరస్యాన్ని దెబ్బ తీసేలా సినిమా ఉందంటూ రిలీజ్ రాష్ట్రం భగ్గుమంది. ఇప్పుడిదే కథకు పార్ట్ 2 కూడా ఉంది? అన్న అంశం ఆసక్తికరంగా మారింది. ప్రారంభోత్సవం తో హడావుడి చేస్తే షూటింగ్ కి అంతరాయం కలుగుతుందని టీమ్ ఎలాంటి ప్రకటన లేకుండా సైలెంట్ గా చుట్టేసినట్లు తెలుస్తోంది. కానీ రిలీజ్ ముందు వివాదాస్పదం అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. `ది కేరళ స్టోరీ` మొదటి భాగం 15 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కించి 300 కోట్ల వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.