పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ది రాజసాబ్ జనవరి 9 అంటే మరో ఐదు రోజుల్లో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. రాజసాబ్ ప్రమోషన్స్ ని దర్శకుడు మారుతి కొంతమందికి ఇంటర్వూస్ ఇస్తున్నారు, హీరోయిన్స్ నిధి, మాళవిక, రిద్ది లు రాజసాబ్ ని ప్రమోట్ చేస్తున్నారు. ప్రభాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చారు వెళ్లారు.
ప్రస్తుతం ఆయన స్పిరిట్ సెట్ లో ఉన్నారో, లేదంటే ఇటలీ వెళ్లిపోయారో తెలియక అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడే ఉంటె ఆయన మీడియా ముందుకు వస్తే బావుంటుంది అనేది చాలామంది అభిప్రాయం, జనవరి 9 న సంక్రాంతికి బరిలోకి వస్తున్న రాజసాబ్ క్రేజ్ ఎంతుంది అనేది అంచనా వేయలేకపోతున్నారు.
మరోపక్క ఓవర్సీస్ లో విజయ్ చివరి సినిమా జన నాయగన్ జోరు ముందు రాజసాబ్ డల్ గా కనిపిస్తుంది. ఓవర్సీస్ లో రికార్డ్ లు కొట్టడం కష్టమే, మరోపక్క రాజసాబ్ సౌండ్ సరిపోతుందా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చూస్తే ప్రభాస్ ఫ్యాన్స్ లో అందోళన కనబడుతుంది. మరి హీరోయిన్స్, మారుతి ఎంతగా రాజసాబ్ ని ప్రమోట్ చేస్తున్నా ఎక్కడో ఏదో వెలితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది.