Advertisement
Google Ads BL

విజయ్ చివరి సినిమాకి సెన్సార్ చిక్కులు


కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన జన నాయగన్ చిత్రం జనవరి 9 న రాబోతుంది. ఈ చిత్రం నందమూరి నటసింహ బాలకృష్ణ-అనిల్ రావిపూడి కలయికలో నేషనల్ అవార్డు విన్ అయిన భగవంత్ కేసరి చిత్రానికి రీమేక్ అనే ప్రచారం ఉంది. కోలీవుడ్ మేకర్స్, అనిల్ రావిపూడి ఎవరూ దీనిపై స్పష్టమైన ఆన్సర్ ఇవ్వరు. 

Advertisement
CJ Advs

ఇక జనవరి 9 న విడుదల కాబోతున్న ఈ చిత్రం తర్వాత తాను సినిమాలను ఆపేస్తున్నట్టుగా, జన నాయగన్ తన చివరి చిత్రమని, ఇకపై రాజకీయాల్లో ప్రజలకు సేవ చేస్తాను అంటూ విజయ్ ప్రకటించారు. అయితే మరో ఆరు రోజుల్లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సెన్సార్ సమస్యలు మొదలయ్యాయి. జన నాయగన్ సినిమాలో హింస, రక్తపాతం ఎక్కువగా ఉందనే వాదన తెరపైకి వచ్చింది.

ఈ సినిమాను రీసెంట్ గా సెన్సార్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) రివ్యూ చేసింది. జన నాయగన్ లో చాలా సన్నివేశాలపై సెన్సార్ బోర్డు అభ్యన్తరాలు వ్యక్తం చేసింది అని, చాలా మార్పులు చేయాలని సలహాలు, సూచనలు అందించింది. సెన్సార్ సభ్యులు కొన్ని సన్నివేశాలకు సంబంధించి 64 కట్స్ ప్రతిపాదించినట్టు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. 

ఇండియాతో పాటుగా ఓవర్సీస్‌లో కూడా జన నాయగన్ చిత్రానికి సంబంధించి సెన్సార్ సమస్యలు ఇబ్బందిగా మారాయి. చాలా దేశాల్లో సెన్సార్ క్లియరెన్స్ రాలేదు. దాంతో ఈ సినిమా రిలీజ్ విషయంలో గందరగోళం ఏర్పడుతున్నది.

Jana Nayagan lands in censor trouble:

Faced censor issues Jana Nayagan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs