కింగ్ నాగార్జున హోస్ట్ గా ప్రతి ఏడాది తెలుగులో స్టార్ మా లో ప్రసారమవుతున్న బిగ్ బాస్.. ఈ ఏడాది సీజన్ 9 ని పూర్తి చేసుకుంది. సీజన్ 9 మొదలైన కొత్తలో చాలా చప్పగా చిరాగ్గా ఫీలైన ప్రేక్షకులు ఆ సీజన్ మధ్యలోకి వచ్చేసరికి బాగా కనెక్ట్ అయ్యారు. బిగ్ బాస్ సీజన్ 9 ఇంతగా పాపులర్ అవడానికి ప్రధాన కారణం కంటెస్టెంట్స్ వాళ్ళ గొడవలు కానే కాదు.
బిగ్ బాస్ రివ్యూస్ చెప్పేవాళ్ళు ఈ సీజన్ 9 ని హిట్ చేసారు. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ గా కళ్యాణ్ పడాల నిలవగా రన్నర్ గా తనూజ నిలిచింది. టాప్ 3 లో కళ్యాణ్ పడాల, తనూజ, ఇమ్మాన్యుయేల్ ఉంటారని అనుకున్న ప్రేక్షకులకు ఇమ్మాన్యుయేల్ 4 వ స్తానం నుంచి ఎలిమినేట్ కావడం, కళ్యాణ్ విన్ అవడం షాకిచ్చింది.
తనూజ, కళ్యాణ్ ఈ ఇద్దరిలో విన్ అయ్యేదెవరో అంటూ ఇద్దరి ఫ్యాన్స్ చాలా కొట్టుకున్నారు. అందుకే ఫినాలే ఎపిసోడ్ కి అంత టీఆర్పీ ఇచ్చారు. బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే కి గెస్ట్ గా ఎవరూ రాలేదు. నాగార్జునే విన్నర్ ని ప్రకటించారు. కాకపోతే ఫినాలే స్టేజ్ పై ఛాంపియన్, రవితేజ భర్తమహాశయులకు విజ్ఞప్తి లాంటి సినిమాల ప్రమోషన్స్ జరిగాయి.
బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి రికార్డ్ టీఆర్పీ రేటింగ్ వచ్చినట్టుగా హోస్ట్ నాగార్జున సగర్వంగా ప్రకటించారు. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి 19.6 రేటింగ్ వచ్చింది అని, గత ఐదు సీజన్స్ రికార్డ్ ను ఈ సీజన్ 9 ఫినాలే బ్రేక్ చేసినట్లుగా ప్రకటించారు.