ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్న సినిమాల్లో ముందుగా ప్రభాస్ రాజసాబ్, విజయ్ జన నాయగన్ సినిమాలు జనవరి 9 న విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు సినిమాల్లో ఓవర్సీస్ లో ఏ సినిమా కి ఎక్కువ క్రేజ్ ఉంది అనేది అక్కడ టికెట్ బుకింగ్స్ డిసైడ్ చేస్తున్నాయి. విజయ్ చివరి సినిమా కావడంతో జన నాయగన్ చిత్రానికి ఓవర్సీస్ లో ఫుల్ డిమాండ్ కనబడుతుంది.
రీసెంట్ గా జన నాయగన్ చిత్ర ఆడియో లాంచ్ వేడుకను మలేషియా లో చేస్తే అక్కడ స్టేడియం కిక్కిరిసిపోయింది. అంతగా విజయ్ అభిమానులు వేలాదిగా ఆ ఈవెంట్ ని సక్సెస్ చేసారు. ఇక ఓవర్సీస్ లో రాజా సాబ్ 342 ప్రదేశాలలో 1,021 స్క్రీన్స్ లో విడుదల కానుంది. టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. బుకింగ్స్ ద్వారా కేవలం 3లక్షల డాలర్లు మాత్రమే వచ్చాయని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి.
మరోపక్క ఓవర్సీస్ లో జన నాయగన్ మూవీతో విజయ్ దూసుకుపోతున్నాడు. విజయ్ నటించే చివరి సినిమా కావడంతో ఓవర్సీస్ లో బాగా క్రేజ్ కనిపిస్తుంది. ఇప్పటికే జన నాయగన్ 1 మిలియన్ మార్క్ దాటింది. ప్రతి ఏరియా లోను విజయ్ జన నాయగన్ చిత్రం ప్రభాస్ రాజాసాబ్ ని డామినేట్ చేస్తుంది. మరి ఈ ఆరు రోజుల్లో ఫైనల్ గా టార్గెట్ ఏది ఛేదిస్తుందో చూడాలి.