Advertisement
Google Ads BL

దురంధ‌ర్‌పై ఆర్జీవీ ప్రేమ వెన‌క‌


ఇటీవ‌లి కాలంలో బాలీవుడ్ ని ద‌క్షిణాది సినిమా డామినేట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దురంధ‌ర్ స‌క్సెస్ సాధించిన‌ప్ప‌టికీ నాలుగు ద‌క్షిణాది సినిమాలు ఇంకా దానిపైన ఉన్నాయి. బాహుబ‌లి 2, కేజీఎఫ్ 2, ఆర్.ఆర్.ఆర్, పుష్ప 2 లాంటి సినిమాల రికార్డుల‌ను దురంధ‌ర్ ఇంకా అధిగ‌మించ‌లేదు. జ‌న‌వ‌రి మొదటి వారంలో దురంధ‌ర్ ఆల్మోస్ట్ అన్ని థియేట‌ర్లు ఖాళీ అయింది. కొత్త సినిమాల కోసం దురంధ‌ర్ తన థియేట‌ర్ల‌ను కూడా త్యాగం చేయాల్సి వ‌చ్చింది.

Advertisement
CJ Advs

ఇదిలా ఉంటే దురంధ‌ర్ మేకింగ్ గురించి, ఆదిత్యాధ‌ర్ గురించి ప్ర‌శంస‌లు కురిపిస్తున్న ఆర్జీవీ ఇప్పుడు సౌత్ సినిమాలో అవాస్త‌విక మేకింగ్ శైలిని తూర్పార‌బ‌ట్టాడు. బాలీవుడ్ తో పోలిస్తే సౌత్ లో క‌మ‌ర్షియ‌ల్ హీరోలకు ఫోకస్ ఎక్కువ‌గా ఉంద‌ని, వాళ్ల‌ను ఉత్త‌రాదినా ఆద‌రిస్తున్నార‌ని అన్నారు. అదే స‌మ‌యంలో సౌత్ సినిమాలోని అతిశ‌యోక్తి పాత్ర‌లు, క‌మ‌ర్షియ‌ల్ విజ‌యం కొద్దిరోజులు మాత్ర‌మే గుర్తుంటాయ‌ని అన్నారు. దురంధ‌ర్ సినిమా క‌థ‌, క‌థ‌నం ఇత‌ర అంశాల్లో ఎంతో డెప్త్ ఉంది. దానిని అనుస‌రించి ఇప్పుడు సౌత్ సినిమా స్క్రిప్టుల్ని తిర‌గ‌రాయాల్సి ఉంద‌ని ఆర్జీవీ అభిప్రాయ‌ప‌డ్డాడు. ఒక ర‌కంగా నార్త్ పై సౌత్ సినిమా దండ‌యాత్ర‌ను దురంధ‌ర్ ఆపింద‌ని పొగిడేసాడు. దురంధ‌ర్ ప్ర‌జ‌ల్ని భ‌యపెడితే, దురంధ‌ర్ 2 హ‌డ‌లెత్తిస్తుందని కూడా అతిశ‌యోక్తిగా వ్యాఖ్యానించాడు.

ర‌ణ్‌వీర్ దురంధ‌ర్ నుంచి చాలా విష‌యాలు సౌత్ సినిమా కూడా నేర్చుకోవాల‌ని సూచించాడు. ఈ సినిమాలో హీరో పాత్రతో పాటు అన్ని పాత్ర‌ల‌కు స‌మ‌ప్రాధాన్య‌త ఉంద‌న్న విష‌యాన్ని ఆర్జీవీ నొక్కి చెప్పాడు. అయితే ఆర్జీవీ తెర‌కెక్కించిన స‌త్య, స‌ర్కార్ త‌ర‌హా మాఫియా క‌థాంశం కావ‌డం వ‌ల్ల‌నే ఇది అత‌డిని అంత‌గా ఆక‌ర్షించింద‌ని కొంద‌రు కామెంట్లు చేస్తున్నారు. దురంధ‌ర్ క‌చ్చితంగా మేకింగ్ ప‌రంగా గొప్ప సినిమా కాద‌న‌లేం.. ఇక మీద‌ట దురంధ‌ర్ ని కొట్టే చాలా సినిమాలు ద‌క్షిణాది నుంచి రాబోతున్నాయ‌న్న‌ది ఆర్జీవీ గుర్తుంచుకోవాల‌ని నెటిజనులు కూడా సూచిస్తున్నారు.

 

Behind RGV affection for Dhurandhar:

Ram Gopal Varma believes Dhurandhar is more than just a blockbuster film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs