బిగ్ బాస్ హౌస్ లో తన మాటతీరు, డ్రెస్సింగ్ స్టయిల్ తో మెస్మరైజ్ చేసిన కంటెస్టెంట్ తనూజ రన్నరప్ గా హౌస్ నుంచి బయటికి వచ్చింది. విన్నర్ కాబోయి రన్నర్ అయిన తనూజ ని లక్షాదిమంది అభిమానులు ఇష్టపడ్డారు, ఆమె రన్నర్ అయితే బాధపడ్డారు. హౌస్ లో కళ్యాణ్ పడాల తో అంటే విన్నర్ తో స్నేహం చేసిన తనూజ ని వైల్డ్ కార్డు ఎంట్రీస్ దారుణంగా టార్గెట్ చేసారు. శ్రీజ అయితే కళ్యాణ్ విషయంలో తనుజాని ఫేక్ అనేసింది.
ఇక తనూజ బయటికి వచ్చాక విన్నర్ కళ్యాణ్ ను కలవలేదు, మిగతా కంటెస్టెంట్స్ ని కలవలేదు. తన ముద్ద మందారం సీరియల్ టీం తో కలిసి కేక్ కట్ చేసుకుంది. అయితే తనూజ హౌస్ లో ఉన్నప్పుడు ఫ్యామిలీ వీక్ లో స్టేజ్ పైకి వచ్చిన ముద్దా మందారం ఫేమ్ పవన్ సాయి తో తనూజ డేటింగ్ లో ఉంది అనే ప్రచారం ఉంది.
బయటికి వచ్చాక పవన్ సాయి తో తనూజ క్లోజ్ గా ఉండడం చూసి తనూజ-పవన్ సాయి ప్రేమలో ఉన్నారనుకుంటున్నారు. తాజాగా తనుజాని అదే అడిగితె కొంతమంది ఎదుగుదల చూసి ఓర్చలేని వాళ్లే ఇలాంటి పుకార్లు పుట్టిస్తారు, పవన్ సాయి తో నేను ఫ్రెండ్ షిప్ మాత్రమే చేస్తున్నాను, తనతో మరే ఇతర రిలేషన్ లేదు అంటూ తనూజ క్లారిటీ ఇచ్చేసింది.