ఎట్టకేలకు `ఛాంపియన్` తో శ్రీకాంత్ తనయుడు రోషన్ ఓ యావరేజ్ హిట్ ని అందుకున్నాడు. అంతకు ముందు నటించిన చిత్రాలకంటే `ఛాంపియన్` మంచి ఫలితాలే సాధించింది. నటుడిగా మంచి పేరొచ్చింది. నటనలో ఈజ్ ..మెచ్యురిటీ కనిపించింది. దీంతో రోషన్ సహా శ్రీకాంత్ కుటుంబంలో సంతోషం నిండిపోయింది. ఇకపై రోషన్ కెరీర్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్లడమే. మరి `ఛాంపియన్` రిజల్ట్ నటుడిగా రోషన్ ని ఎంత బిజీగా మారు స్తుందో చూడాలి.
ఈ నేపథ్యంలో తాజాగా ఓ క్రేజీ డైరెక్టర్ తో రోషన్ ఛాన్స్ అందుకున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. రోషన్ హీరోగా క్రైమ్ థ్రిల్లర్ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను ఓ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించడానికి ముందుకొస్తున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే రోషన్ కి మంచి అవకాశమే అవుతుంది. శైలేష్ సినిమాలంటే మార్కెట్ లో ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు తెరకెక్కిచడంలో అతడో మాస్టర్.
`హిట్` ప్రాంచైజీ సృష్టికర్త అతడే అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కార్తీ హీరోగా `హిట్ 4` కి సన్నాహాలు చేస్తున్నారు. ఇదే ఏడాది ఈ చిత్రం పట్టాలెక్కనుంది. అనంతరం శ్రీకాంత్ తనయుడి సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. మరి రోషన్ ని ఎలాటి కథలో హైలైట్ చేస్తాడు? అన్నది చూడాలి. ఇంత వరకూ శైలేష్ కేవలం క్రైమ్ సినిమాలు మాత్రమే చేసాడు. అతడి ఆలో. ఆలోచనలన్నీ క్రైమ్ చుట్టూనే తిరిగాయి.
మరో కొత్త జోరనర్ ప్రయత్నించలేదు. ఈ నేపథ్యంలో రోషన్ కోసం ఎలాంటి కథ రాసాడు? అన్నది కూడా ఆసక్తి కరమే. మరి శైలేష్ మార్క్ జోనర్ లోకి ఎంటర్ లాగుతాడా? రోషన్ తో కొత్తగా ట్రై చేస్తాడా? అన్నది చూడాలి. ఈ సినిమాతో పాటు రోషన్ ఇంకెంత మంది నవతరం దర్శకులకు టచ్ లో ఉన్నాడో ? తెలియాలి. కొత్త ఏడాది నేపథ్యంలో కొత్త అప్ డేట్ ఇస్తాడేమో చూడాలి.