రాకింగ్ స్టార్ యష్ నటించిన కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సంచలన విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలతో అతడి గ్రాఫ్ అమాంతం స్కైని తాకింది. ప్రస్తుతం టాక్సిక్, రామాయణం లాంటి భారీ ప్రాజెక్టులలో యష్ నటిస్తున్నాడు. టాక్సిక్ నిర్మాణానంతర పనులు పూర్తి చేస్తుండగానే, నితీష్ తివారీ `రామాయణం`లో తన పాత్ర కోసం అతడు మేకోవర్ సాధించాడు. ప్రస్తుతం రామాయణం షూటింగ్ ని వేగంగా పూర్తి చేస్తున్నారు.
టాక్సిక్ మార్చి 19న ఉగాది కానుకగా విడుదలవుతుండగా, అదే రోజు రణ్ వీర్ దురంధర్ 2 కూడా విడుదలవుతోంది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం సహా హిందీలో `టాక్సిక్` అత్యంత భారీగా విడుదల కానుంది. అయితే హిందీ బెల్ట్ లో దురంధర్ 2 ప్రభావం ముందు టాక్సిక్ నిలబడుతుందా? అన్న చర్చ సాగుతోంది. కేజీఎప్ స్టార్‌ని రణ్ వీర్ రేసులో వెనక్కి నెట్టేస్తాడా? అన్నది ఆసక్తిగా మారింది.
అయితే కల్ట్ డైరెక్టర్ ఆర్జీవీ దీనిపై తన అభిప్రాయాన్ని ముక్కు సూటిగా చెప్పేసారు. దురంధర్ 2 సునామీ ముందు టాక్సిక్ నిలబడదని అభిప్రాయడ్డారు. తన ఎక్స్ ఖాతాలో `ధురంధర్ 2` దెబ్బనే `టాక్సిక్`గా ఉంటుందని ఆర్జీవీ రాసారు. నిజానికి కేజీఎఫ్ స్టార్ యష్ భారతదేశంలో బిగ్గెస్ట్ స్టార్ అని కితాబిచ్చిన ఆర్జీవీ ఇప్పుడు దురంధర్ పైనే అభిమానం ప్రదర్శించడం ఆశ్చర్యపరిచింది. కానీ `దురంధర్` సీక్వెల్‌పై ఎంత భారీ క్రేజ్ ఉందో ఆయన మాటలు వెల్లడిస్తున్నాయి. `దురంధర్` చిత్రం బాక్సాఫీస్ వద్ద 1200కోట్ల వసూళ్లతో సంచలనం సృష్టించింది. ఈ సినిమా చాలా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. అందుకే పోటీబరిలో టాక్సిక్ నిలబడలేదని వ్యాఖ్యానించారని భావిస్తున్నారు. దురంధర్ మానియా నేపథ్యంలో `టాక్సిక్` రిలీజ్ తేదీ సరైనదేనా కాదా? అన్నది సమీక్షించుకుంటారా లేదా? అన్నది వేచి చూడాలి.