సూపర్ స్టార్ మహేష్ ప్రతి ఏడాది న్యూ ఇయర్ ని ఫ్యామిలీ తో సెలెబ్రేట్ చేసుకుంటారు. క్రిస్టమస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఏదో ఒక దేశానికీ ఫ్యామిలీతో కలిసి ట్రిప్ వేసి అక్కడే న్యూ ఇయర్ కి స్వాగతం చెబుతూ ఉంటారు. అయితే ఈఏడాది మహేష్ వారణాసి షూటింగ్ లో బిజీగా వుంటారు, రాజమౌళి న్యూ ఇయర్ గ్యాప్ కూడా ఇవ్వరు.
మహేష్ ఈ ఏడాది న్యూ ఇయర్ కి ఫ్యామిలీ ట్రిప్ వెయ్యరనే అనుకున్నారు. కానీ వారణాసి షూటింగ్ కి బ్రేక్ రావడము, రెండు రోజుల క్రితమే మహేష్ బాబు భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితార లతో కలిసి వెకేషన్ కి చెక్కేసారు. అక్కడ ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూ న్యూ ఇయర్ కి గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు మహేష్.
తాజాగా నమ్రత న్యూ ఇయర్ కి స్వాగతం చెబుతూ ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. సితార కి మహేష్ ముద్దుపెడుతున్న పిక్స్, కేక్ కట్ చేస్తున్న పిక్స్ షేర్ చేసింది. ఆ పోస్ట్ కింద సూపర్ స్టార్ అభిమానులు మహేష్ కి న్యూ ఇయర్ విషెస్ చెబుతూ పోస్ట్ లు పెడుతున్నారు.