దర్శకుడు మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో అద్దిరిపోయె భారీ బడ్జెట్ రాజసాబ్ ని తెరకెక్కించి ఎన్నో ఒడిడుకులు, మరెన్నో అవమానాలను దాటుకుని జనవరి 9 న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. ప్రస్తుతం రాజసాబ్ ప్రమోషన్స్ మారుతీ ఎన్నో విషయాలను పంచుకుంటున్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మారుతిని మీరు సక్సెస్ అవ్వకూడదు అని కొందరు కోరుకుంటున్నారు, రాజాసాబ్ తో మీరు ప్లాప్ కొట్టాలని అనుకుంటున్నారు దానికి మీరేమనుకుంటున్నారు అంటే దానికి మారుతి నేను రాజసాబ్ తర్వాత బిజీ అయిపోతానేమో అనే ఆలోచనతో వారు అలా అనుకుంటున్నారేమో, పెద్ద హీరోతో సినిమా చేసాక స్టార్ డైరెక్టర్ అవుతారు, ఆతర్వాత నేను పెద్ద హీరోలతో మాత్రమే జర్నీ చేస్తాను అనుకుంటున్నారేమో.
ఇప్పుడు చిన్న సినిమాల ఈవెంట్స్ కి గెస్ట్ గా వెళుతున్నాను, రాజాసాబ్ తర్వాత పిలిచినా రాను అని నేను సక్సెస్ అవ్వకూడదు అనుకుంటున్నారేమో, పక్కింటివాళ్ళు కారు కొనుకుంటే ఫీలైపోతారు, నేను పెద్ద హీరోతో సినిమా చేస్తున్నాను అంటే అలానే అసూయపడేవాళ్లు ఉంటారు.
నేను విజయాన్ని, స్టార్ డమ్ ని శాశ్వతం అనుకోను, రాజాసాబ్ తర్వాత చిన్న సినిమా చెయ్యాలి అనుకుంటే చేస్తాను, నా దగ్గర చాలా కథలున్నాయి, నాకు స్టోరీ ముఖ్యం, దానికి చిన్న హీరో అయినా, పెద్ద హీరో అయినా నేనేమి ఫీలవ్వను అంటూ మారుతి చెప్పుకొచ్చారు. అది చూసాక మారుతి నాశనాన్ని కోరుకుంటున్నదెవరో అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.