జనవరి 9 న విడుదల కాబోతున్న రాజసాబ్ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. ప్రభాస్ రాజాసాబ్ ఈవెంట్ కి రావడం, సాంగ్స్ రిలీజ్, దర్శకుడు మారుతి ఇంటర్వూస్, హీరోయిన్స్ అందాలు ఆరబోస్తూ రాజసాబ్ ప్రమోషన్స్ లో పాల్గొనడం అన్ని రాజసాబ్ పై క్రేజ్ పెంచేవిలా ఉన్నాయి. అలాంటి సమయంలో ప్రభాస్-సందీప్ వంగ కలయికలోతెరకెక్కుతున్న స్పిరిట్ లుక్ న్యూ ఇయర్ స్పెషల్ గా వచ్చేసింది.
రాజసాబ్ సినిమా రిలీజ్ అయ్యాక స్పిరిట్ లుక్ వస్తే బావుండేది, అనవసరంగా మారుతి ఇస్తోన్న రాజసాబ్ హైప్ స్పిరిట్ ఫస్ట్ లుక్ డిస్టర్బ్ చేస్తుంది. రాజసాబ్ రిలీజ్ వరకు ఆగాల్సింది అనే మాట వినబడింది. స్పిరిట్ లో ప్రభాస్ కల్ట్ గా మాస్ లుక్ లో కనిపిస్తారు, రాజాసాబ్ లో రకరకాల గెటప్స్ లో కనిపిస్తారు.
సో స్పిరిట్ లో ప్రభాస్ ని చూసాక రాజసాబ్ లుక్స్ లో ప్రభాస్ ఆనకపోవచ్చు అనేది కొంతమంది వాదన. అయితే స్పిరిట్ లుక్ చూసాక కామన్ ఆడియన్స్ మాత్రం సందీప్ రెడ్డి మరోసారి యానిమల్ నే చూపించారు తప్ప స్పిరిట్ లో కొత్తగా ఏమి కనిపించలేదు అనే మాటలు ప్రభాస్ ఫ్యాన్స్ ని కాస్త డిస్టర్బ్ చేసాయి.
స్పిరిట్ లుక్ వల్ల రాజసాబ్ కి ఏమి లాస్ రాదులే అంటున్నారు. స్పిరిట్ లుక్ ని ఎంతో కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తే సందీప్ వంగ నిరాశపరిచాడనే మాట వినబడుతుంది.