ఈమధ్యన హీరోయిన్స్ డ్రెస్సింగ్ స్టయిల్ విషయంలో నటుడు శివాజీ తో నువ్వా-నేనా అంటూ పోట్లాడిన అనసూయ 2025 ఏడాదిని ముగిస్తూ 2026 కి వెల్ కమ్ చెప్పింది. అది కూడా భర్త తో కలిసి బికినీ షో చేస్తూ స్విమ్ సూట్ లో. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం భర్త భరద్వాజ్ తో కలిసి వెకేషన్ కు వెళ్లిన అనసూయ అదిరిపోయే బికినీ ఫొటోస్ షేర్ చేసింది.
అంతేకాదు.. అదే స్త్రీ. అదే వెన్నెముక. కానీ నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాను.. వృద్ధి.. శాంతి.. మరియు ఎప్పటిలాగే.. అర్ధంలేని విషయాలను సహించను!! నాకు ఇష్టమైన పనులు చేయడం.. అపరాధ భావన లేకుండా తినడం.. పరిమితులు లేకుండా ప్రయాణించడం.. మరియు భయం లేకుండా మాట్లాడటం!!
ఇక్కడ బిగ్గరగా జీవించడం.. కష్టపడి ప్రేమించడం మరియు ఈ నూతన సంవత్సరంలో ప్రకాశవంతంగా ప్రకాశించడం!! మీ అందరికీ శబ్దం కంటే ధైర్యం ఎక్కువగా ఉండాలని కోరుకుంటున్నాను 😏
అందరికీ 2026 శుభాకాంక్షలు!!!!!! 🥳✨✔️😣🫠 అంటూ అనసూయ మరోసారి తను ఎలా ఉండాలనుకుంటుందో, ఎలా ఉంటుందో స్పష్టం చేసింది.