`డ్రాగన్` విజయంతో కయాదు లోహార్ టాలీవుడ్ లో ఎంతో ఫేమస్ అయిందో తెలిసిందే. తమిళ అనువాద చిత్రంతోనే తెలుగు యువత మనసులు గెలిచింది. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ అంతకంతకు రెట్టింపు అయింది. ఓ అనువాద సినిమాతో అంతగా పాపులర్ అవ్వడం అంటే చిన్న విషయం కాదు. ఆ విషయంలో అమ్మడికి అదృష్టం కూడా తోడవ్వడంతోనే సాధ్యమైంది. మరి అంతగా పాపులర్ అయిన బ్యూటీ తెలుగులో ఇప్పటికే బిజీ అవ్వాలి.
మరి అలా ఛాన్సులు ఇక్కడ అందుకుంటుందా? అంటే లేదనే చెప్పాలి. `ఫంకీ`, `ది ప్యారడైజ్` మినహా కొత్త చిత్రాలు వేటికి కమిట్ అవ్వలేదు. కానీ ఇక్కడ వచ్చిన గుర్తింపు మాత్రం కోలీవుడ్, మాలీవుడ్ లో మాత్రం పుల్ అయింది. వరుస సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. ప్రస్తుతం తమిళ్ లో నాలుగు సినిమాల్లో నటిస్తోంది. మలయాళంలో మరో మూడు సినిమాలు చేస్తోంది. ఈ సినిమాలన్నీ కొత్త ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చేవే.
వాటి రిలీజ్ అనంతరం సక్సెస్ అయితే గనుక ఆ రెండు భాషల్లో మరింత బిజీ అవుతుంది. స్టార్ హీరోల చిత్రాలకు ప్రమోట్ అవుతుంది. కయాదు లాంటి హాట్ బ్యూటీ కోలీవుడ్ అభిమానుల హృదయాలకు దగ్గరైంది అంటే? గుడులు గోపురాలు కట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఆ స్థాయి అభిమానం అక్కడ సాధ్యమే. అలాగే తెలుగులో నటిస్తోన్న `ఫంకీ`, `ది ప్యారడైజ్` కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకొస్తున్న చిత్రాలే.
`ప్యారడైజ్` పాన్ ఇండియాలో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా విజయం సాధిస్తే గనుక దేశ వ్యాప్తంగా ఒకేసారి ఫేమస్ అవుతుంది. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్న సంగతి తెలిసిందే. కయాదు లోహర్ కెరీర్ తొలుత కన్నడ పరిశ్రమలో ప్రారంభమైంది. కానీ ఆ తర్వాత మళ్లీ కన్నడ చిత్రాల్లో నటించలేదు. మాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ కే పరిమితమైంది.