పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత వెయిట్ పెరగడం, ఆ తర్వాత మోకాలి నెప్పితో బాధపడడంతో.. ప్రస్తుతం ఆయనకున్న క్రేజ్ తో ప్రభాస్ తో సినిమాలు కమిట్ అయిన దర్శకులు జస్ట్ ప్రభాస్ ని తీసుకొచ్చి ఆయన్ని పక్కనపెట్టి బాడీ డబుల్ తో అంటే డూప్ తో పని కానిచ్చేస్తున్నారు అంటూ ఎప్పటినుంచో సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
అదే ప్రశ్న రాజసాబ్ ఇంటర్వ్యూలో దర్శకుడు మారుతి కి ఎదురైంది. ప్రభాస్ కాకుండా AI లో డబ్బింగ్ చెబుతున్నారు, ప్రభాస్ బాడీ డబుల్ తో మ్యానేజ్ చేస్తున్నారని అంటుంటారు నిజమేనా అని అడిగితే దానికి మారుతి.. ఓన్లీ బ్యాక్ షాట్స్ లోను, అలాగే కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లోను ప్రభాస్ బాడీ డబుల్స్ ని యూస్ చేసాం.
మన స్టార్ హీరోలు మనకు దొరికిన డైమండ్స్. అందుకే వాళ్ళను అనవసరంగా యాక్షన్ సీక్వెన్స్ లో ఇబ్బంది పెట్టకుండా డూప్ ని యూస్ చెయ్యాలి, ఇక రాజసాబ్ లో హీరోయిన్స్ సీన్స్ అన్నిటిలో ప్రభాస్ గారే చేసారు, హీరోయిన్స్ కి ప్రభాస్ చాలా రెస్పెక్ట్ ఇస్తారు అంటూ మారుతి బాడీ డబుల్ పై క్లారిటీ ఇచ్చారు.