జనవరి 1st న్యూ ఇయర్ స్పెషల్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగ కలయికలో క్రేజీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న స్పిరిట్ నుంచి అప్ డేట్ రాబోతుంది అనే వార్త ప్రభాస్ ఫ్యాన్స్ ని నిలవనియ్యడం లేదు. రీసెంట్ గానే మొదలైన స్పిరిట్ షూటింగ్ లో ప్రభాస్ కొద్దిరోజులు మాత్రమే పాల్గొన్నారు. అప్పుడే సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ లుక్ సిద్ధం చెయ్యడమే అభిమానుల ఆనందానికి కారణం.
మరికాసపేట్లో అంటే జనవరి 1 కి మరికొన్ని గంటలే సమయం ఉంది, ఈలోపే దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సోషల్ మీడియా వేదికగా
People…
A few hours more for SPIRIT – First Poster.
#Spirit
అంటూ వేసిన ట్వీట్ ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కి ఊపిరి ఆగిపోయేట్టు చేసింది. ఒకపక్క రాజసాబ్ ప్రమోషన్స్ తో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. మరోపక్క కల్ట్ డైరెక్టర్ సందీప్ వంగ సడన్ సర్ ప్రైజ్ అంటూ స్పిరిట్ లుక్ రివీల్ చెయ్యడం అభిమానుల సంబరాలకు కారణమైంది.