రాజాసాబ్ ని ప్రభాస్ ఒప్పుకున్నారు అనగానే ప్రభాస్ ఫ్యాన్స్ దర్శకుడు మారుతి పై ఇంతెత్తున విరుచుకుపడ్డారు. ప్రభాస్ ఏమిటి మిడ్ రేంజ్ దర్శకుడికి అవకాశం ఇవ్వడమేమిటి అని. మారుతిపై ప్రభాస్ ఫ్యాన్స్ లో ఏ కోశానా నమ్మకమే లేదు. రాజేష్ సాబ్ ఫస్ట్ లుక్ తో మారుతి ప్రభాస్ ఫ్యాన్స్ ని శాంతపరిచినా, రాజసాబ్ ట్రైలర్ తో ఇంప్రెస్స్ చేసినా మారుతి పై ప్రభాస్ ఫ్యాన్స్ లో ఎక్కడో చిన్న అపనమ్మకం ఉండిపోయింది.
కానీ మారుతి మాత్రం రాజసాబ్ ఈవెంట్ లో ఎమోషనల్ గా రాజసాబ్ చూసాక సినిమాపై అభిమానుల్లో ఏ చిన్న అసంతృప్తి ఉన్నా నా ఇంటి అడ్రెస్స్ చెబుతాను, అక్కడికి రండి అంటూ మారుతి తన ఇంటి అడ్రెస్స్ చెప్పేసాడు. ఆతర్వాత రెండు రోజులకు రాజసాబ్ నుంచి రిలీజ్ ట్రైలర్ వచ్చింది, అది చూసాక ప్రభాస్ ఫ్యాన్స్ కి పిచ్చెక్కిపోయింది.
మారుతి ఏ ఉద్దేశ్యంతో అయితే తన ఇంటి అడ్రెస్స్ అభిమానులకు ఇచ్చాడో, అది మర్చిపోయి ప్రభాస్ ఫ్యాన్స్ మారుతి కోసం ఆయన ఇంటి అడ్రెస్స్ కి బిర్యాని పార్సిల్స్ పంపించి సర్ ప్రైజ్ చేసిన విషయాన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుని ప్రభాస్ అభిమానులకు ధన్యవాదాలు చెప్పాడు మారుతి.
మరి ప్రభాస్ అభిమానులకు ఆనందమొచ్చినా, లేదంటే ఆగ్రహమొచ్చినా తట్టుకోవడం కష్టం అనేది ఈ సంఘటన తో ప్రూవ్ అయ్యింది. వాళ్లకు తన వైపు నుంచి జనవరి 9న రివర్స్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లు మారుతి చెప్పుకొచ్చారు.