ది రాజాసాబ్ విడుదలకు ఇంకా వారం మాత్రమే సమయం ఉంది. జనవరి 9 సంక్రాంతి స్పెషల్ గా రాజసాబ్ విడుదల కాబోతుంది. ప్రస్తుతం తెలుగులో రాజసాబ్ ని ముగ్గురు హీరోయిన్స్ నిధి, మాళవిక రిద్ది తో పాటు గా దర్శకుడు మారుతి ప్రమోట్ చేస్తూ ఇంటర్వూస్ ఇస్తున్నారు. మరి రాజ్ సాబ్ ని పాన్ ఇండియాలో విడుదల చెయ్యడం లేదా,
ఒక వేళ సినిమాని పాన్ ఇండియా మార్కెట్ లో విడుదల చేస్తే ప్రమోషన్స్ ఎక్కడా, కేవలం మేకర్స్ సౌత్ అందులోను తెలుగుపైనే ఫోకస్ చేసారు. నార్త్ ఆలోచనే లేదు. పాన్ ఇండియా లో ప్రమోషన్స్ చెయ్యక్కర్లేదా.. ప్రభాస్ క్రేజ్ తో పాన్ ఇండియా మర్కెట్ లో రాజసాబ్ విడుదల చేసినా సినిమా ఆడేస్తుంది అని మేకర్స్ అనుకుంటున్నారా. ప్రభాస్ అయితే రాజసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. మళ్ళి కనబడలేదు.
ఆయనేదో విదేశాలకు వెళుతున్నారని ప్రచారం జరుగుతుంది. ప్రభాస్ ఇకపై రాజసాబ్ ప్రమోషన్స్ కి అందుబాటులో ఉండరు, అంటే ఈలెక్కన పాన్ ఇండియా లో రాజసాబ్ ప్రమోషన్స్ లేనట్లే కనిపిస్తుంది వ్యవహారం.