సంక్రాంతి బరిలో ఏకంగా ఐదు సినిమాలు పోటీపడుతున్నాయి. అందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ద రాజాసాబ్ ఒకటి. ఈ చిత్రం జనవరి 9 నే విడుదలకాబోతుంది. ఇక మరొకటి మెగాస్టార్ చిరు-అనిల్ రావిపూడి ల మన శంకర వరప్రసాద్ గారు. ఇది జనవరి 12 న విడుదలకాబోతుంది. మాస్ మహారాజ్ భర్త మహాశయులకు విజ్ఞప్తి జనవరి 13 న, నవీన్ పోలిశెట్టి, శర్వాలు జనవరి 14 న అనగనగ ఒక రాజు, నారి నారి నడుమ మురారి తో పోటీకి దిగుతున్నారు.
అయితే ఏ సినిమాకి ఎంత బడ్జెట్ అయ్యింది, ఏ సినిమాకి ఓపెనింగ్స్ ఎక్కువ ఉంటాయి, ఏ సినిమా కి ఆడియన్స్ లో క్రేజ్ ఉంది, ఏ సినిమా కలెక్షన్స్ రికార్డ్ లు క్రియేట్ చేస్తాయనే విషయం పక్కనబెడితే.. ఇప్పడు ఈ ఐదు సినిమాల ప్రమోషన్స్ విషయంలో చాలామంది లెక్కలు, తూకాలు వేస్తున్నారు. ఏ సినిమా ని ఎంత ప్రమోట్ చేస్తున్నారు, ఏది ఎక్కువ జనాల్లోకి వెళుతుంది.
ఏ సినిమాని ప్రేక్షకులు ఇష్టపడుతున్నారనే విషయంలో ఆడియన్స్ లో చాలా క్యూరియాసిటీ ఉంది. ప్రభాస్ రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి హైప్ క్రియేట్ చేసారు, అలాగే మెగా-అనిల్ మన శంకర వరప్రసాద్ గారు ప్రమోషన్స్ గురించి వేరే చెప్పక్కర్లేదు, మరోపక్క రవితేజ బుల్లితెర పండగ ఈవెంట్స్ లో హడావిడి చేస్తున్నాడు. ఇక నవీన్ పోలిశెట్టి ప్రమోషన్స్ ని వేరే ప్రత్యేకంగా చెప్పాలా.. ప్రమోషన్స్ లో వేరే లెవల్ చూపిస్తాడు. సంక్రాంతి రేసులో అన్నిటికన్నా వెనుకబడింది మాత్రం నారి నారి నడుమ మురారి.
అంటే శర్వానంద్ అండ్ మేకర్స్. సంక్రాంతి బరి లో సినిమాని దించుతున్నాడు. అంటే ఎలాంటి స్పీడు ఉండాలి. అసలే సంక్రాంతి ఫైట్, అది మాములుగా ఉండదు, అలాంటప్పుడు ఏ రేంజ్ ప్రమోషన్స్ చెయ్యాలి. చూద్దాం శర్వా ఏం చేస్తాడో అనేది.