బిగ్ బాస్ హౌస్ లో కంటెంట్ కోసం ఫ్రెండ్ షిప్ చేసిన డిమోన్ పవన్, రీతూ చౌదరి లు ఆ ఫ్రెండ్ షిప్ కాస్త లవ్ ట్రాక్ గా మలిచి గొడవలు పడుతూ, తినిపించుకుంటూ, ఏడుస్తూ, టాస్క్ ల్లో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ.. ఫైర్ స్ట్రోమ్స్ రీతూ ని టార్గెట్ చేస్తూ నామినేషన్స్ వేసినా ఇద్దరూ వెనక్కి తగ్గలేదు. ఎంతగా కంఫర్ట్ ఫ్రెండ్ షిప్ అయినా వీరి స్నేహం వల్ల ఒకరికోరు నష్టపోయారు. రీతూ టాప్ 5 అనుకుంటే రెండు వారాల ముందే ఎలిమినేట్ అయ్యింది.
కప్ కొడతాడనుకున్న డిమోన్ పవన్ చావు తప్పి కన్నులొట్టపోయినట్లు గా టాప్ 3 తో సరిపెట్టుకున్నాడు. అయితే హౌస్ లోనే కాదు హౌస్ బయట వీరి బంధంపై చాలా అనుమానాలున్నాయి. కానీ బయట కూడా రీతూ-పవన్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. తాజాగా స్టార్ మా పరివార్ లో పవన్, రీతూ లు మరోసారి తగ్గేదెలా అన్నట్లుగా మాట్లాడారు. రీతూ నాకు సపోర్ట్ చేసింది అని డిమోన్ పవన్ అంటే రీతూ పవన్ కి ముద్దులు పెట్టిన ప్రోమో వైరల్ అవుతోంది.
ఈ ప్రోమోలో ఇమ్మాన్యుయెల్, విన్నర్ కళ్యాణ్, శ్రీజ, దివ్య, భరణి, సంజన, సుమన్ శెట్టిలు కనిపించారు కానీ.. రన్నర్ గా నిలిచిన తనూజ కనిపించలేదు.