తెలుగమ్మాయి ఈషా రెబ్బ మిడియం రేంజ్ సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైంది. ఎప్పుడు షూటింగ్స్ తో బిజీగా వుండే ఈషా రెబ్బ ప్రస్తుతం తరుణ్ భాస్కర్ తో కలిసి ఓం శాంతి శాంతి శాంతిః మూవీలో నటిస్తుంది. అయితే ఈ చిత్రంలో నటిస్తున్నప్పుడు ఈషా రెబ్బ హీరో కమ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ప్రేమలో పడింది అనే వార్త వైరల్ అయ్యింది.
వారిద్దరూ ఎక్కడ కనిపించినా లవ్ బర్డ్స్ అంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఓం శాంతి శాంతి శాంతిః ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ఈషా రెబ్బ తాజాగా సోషల్ మీడియాలో వదిలిన పిక్స్ చూస్తే వావ్ పదహారణాల తెలుగమ్మాయి ఈషా రెబ్బ అంటూ కామెంట్స్ చేసేదిలా ఉంది.
బ్లూ హాఫ్ శారీ లో ఈషా రెబ్బ తెలుగందం ఉట్టిపడేలా కనిపించింది. బుట్టబొమ్మలా జడవేసుకుని జ్యువెలరీ పెట్టుకుని అందంగా ఆకర్షణగా కనిపించింది.