క్యూట్ బ్యూటీ శ్రీలీల సౌత్ లో విజయం కోసం తెగ వెయిట్ చేస్తుంది. ధమాకా తర్వాత ఆ రేంజ్ సక్సెస్ కోసం శ్రీలీల పదే పదే పరుగులు పెడుతూనే ఉంది. కానీ సక్సెస్ శ్రీలీల అందానికి అగ్ని పరీక్షగా మారింది. అందం ఉంది, డాన్స్ ఉంది, కానీ అదృష్టమే లేదు అన్నట్టుగా శ్రీలీల కెరీర్ తయారైంది.
తెలుగులో వరస పరాజయాలు, కోలీవుడ్ లో పరాశక్తి రిజల్ట్ కోసం వెయిటింగ్, మరోపక్క హిందీలో శ్రీలీల వరస ప్రాజెక్ట్స్ తో కళకళలాడుతుంది. ఈలోపు యాడ్ షూట్స్ అంటూ తెగ బిజీగా గడుపుతుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే శ్రీలీల అదిరిపోయే ఫోటో షూట్స్ తో యూత్ ని అట్రాక్ట్ చేసింది.
తాజాగా వైట్ చుడిదార్ లో కూల్ అండ్ స్వీట్ గా దర్శనమిచ్చింది. అమాయకపు చూపులతో అదిరిపోయే అందాలతో శ్రీలీల లేటెస్ట్ ఫొటోస్ నెట్టింట్లో సంచలంగా మారాయి. ఇంత అందమైన బ్యూటీ కి ఒక్క హిట్ ఇవ్వు దేవుడా అంటూ ఆమె అభిమానులు భగవంతుణ్ణి ప్రార్దిస్తున్నారు.