నమస్తే ఫ్రెండ్స్ నా పేరు అన్వేష్ నేను ప్రపంచ యాత్రికుడిని వెల్కమ్ టు మై ఛానల్ నా అన్వేషణ అంటూ గుక్కతిప్పుకోకుండా ఆంధ్ర యాసలో మాట్లాడే నా అన్వేష్ కి ప్రపంచ యాత్రికుడిని అనే పొగరు బాగా ఎక్కింది. ఇప్పుడు అది దిగేవరకు ఆయన సబ్ స్క్రైబర్స్ ఆయనకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కారణం ఆయన యాత్రలకన్నా ఎక్కువగా బూతులు మాట్లాడడమే.
రీసెంట్ గా గరికపాటి పై అలాగే నటుడు శివాజీ పై బూతులతో రెచ్చిపోయిన నా అన్వేష్ యూట్యూబ్ నుంచి సబ్ స్క్రైబర్స్ జారీ పోతున్నారు. నా అన్వేష్ కి ఎంతమంది ఫాలోయింగ్ ఉన్నారో అందులో సగానికి సగం వెళ్లిపోతున్నారు. నా అన్వేషణ ఛానల్ ని విపరీతంగా లైక్ చేసినవారు ఇప్పడు అన్వేష్ ని తిట్టిపోస్తూ అతనికి అతని యూట్యూబ్ ఛానల్ కి దణ్ణం పెడుతున్నారు.
గరికపాటి ఆడవాళ్ళ దుస్తుల విషయంలో ఇచ్చిన సలహాను, నటుడు శివాజీ హీరోయిన్స్ వస్త్రధారణ విషయంలో చేసిన కామెంట్స్ పై రెచ్చిపోయిన అన్వేష్ హిందూ దేవుళ్లను లాగుతూ మాట్లాడిన మాటలు అతన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది. సీత, ద్రౌపతి లు చీరలు కట్టుకున్నా వారిని ఎత్తుకుపోయారు, వారికి అవమానము జరగలేదా అంటూ వెటకారంగా అనీష్ చేసిన కామెంట్స్ పై ఆయన్ను ఇష్టపడేవాళ్ళే తిట్ల పురాణం తగులుకున్నారు.
నేనేమన్నాను సీత ను ఎత్తుకుపోయిన రావణాసురుడు చచ్చాడు, ద్రౌపతిని చెరబట్టిన కౌరవులు పోయారంటూ మాట్లాడాను, తప్పైతే సారీ అంటూ చెప్పినా వినడం లేదు జనాలు.
నా అన్వేష్ ని అరెస్ట్ చెయ్యాలంటూ ఆయన సబ్ స్క్రైబర్స్ ట్వీట్లు పెడుతున్నారు అంటే నా అన్వేష్ కి ఎక్కింది దిగేవరకు ఊరుకునేలా లేరు.