ద రాజసాబ్ బ్యూటీస్ సినిమాలోనే కాదు బయట ప్రమోషన్స్ లోను గ్లామర్ గా పోటీపడుతున్నారు. ప్రభాస్ తో ద రాజాసాబ్ లో రొమాన్స్ చేసిన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ లు సినిమాలో చాలా గ్లామర్ గా కనిపిస్తున్నారు. ముగ్గురు హీరోయిన్స్ సాంగ్ లో అదిరిపోయే గ్లామర్ షో చేసారు.
ఇప్పుడు ప్రమోషన్స్ లోను ముగ్గురు భామలు గ్లామర్ విషయంలో పోటీ పడుతున్నారు. నిధి అగర్వాల్ ద రాజసాబ్ ని తెగ ప్రమోట్ చేస్తుంది. చీరకట్టు అయినా, లేదంటే మోడ్రెన్ డ్రెస్ అయినా ఎందులోనైనా నిధి హాట్ షో హైలెట్ అవుతుంది. ఇప్పుడు రిద్ది కుమార్ కూడా ద రాజసాబ్ ప్రమోషన్స్ లో గ్లామర్ షో మొదలు పెట్టింది.
ఇక మాళవిక మోహనన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె ఎక్కడ బయట కనిపించినా అందాలు ఆరబోసే పనిలోనే ఉంటుంది. సో రాజసాబ్ ఈవెంట్ లోనే కాకుండా.. ఇకపై రాజసాబ్ ప్రమోషన్స్ లోను మాళవిక అందాలు చూసేందుకు అభిమానులు సిద్ధమా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
అటు నిధి అగర్వాల్, ఇటు మాళవిక మోహనన్, మరోపక్క రిద్ది కుమార్ ఈ ముగ్గురికి రాజాసాబ్ హిట్ కీలకం కాబోతుంది. మరి ప్రభాస్ ఈ ముగ్గురిని ఒడ్డున పడేస్తారో లేదో, చూడాలి.