ఈ ఏడాది జనవరి అంటే సంక్రాంతి పండక్కి వస్తానన్న విశ్వంభర అప్పుడు పోస్ట్ పోన్ అయ్యి వచ్చే ఏడాది ఏప్రిల్ కి వాయిదా పడింది. సీజీ వర్క్ పూర్తి కానీ కారణంగా దర్శకుడు వసిష్ఠ సినిమాని అంత దూరం తీసికెళ్ళిపోయాడు. విశ్వంభర టీజర్ పై వచ్చిన విమర్శలతో ఈ సినిమాని వసిష్ఠ వాయిదా వేసి ప్రస్తుతం ఆ సీజీ వర్క్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు.
అయితే తాజాగా విశ్వంభర వచ్చే ఏడాది ఏప్రిల్ కి కూడా వచ్చే అవకాశం లేదు, జూన్ లో విశ్వంభర విడుదల ఉండొచ్చనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఏడాది కాలంగా దర్శకుడు వసిష్ఠ ఏం చేస్తున్నాడో తెలియదు, అసలు విశ్వంభర అప్ డేట్ లేక మెగా ఫాన్స్ ఆగ్రహంగా ఉన్నారు. మరోపక్క విశ్వంభర తర్వాత చిరు ఒప్పుకున్న వరప్రసాద్ గారు విడుదలకు వచ్చేసింది.
చిరు విశ్వంభర ను పక్కనపడేసి మన శంకర్ వరప్రసాద్ గారు ని ఫినిష్ చేసేసి.. జనవరి 12 న విడుదలకు రెడీ చేసేసారు. మరి విశ్వంభర మరోసారి ఏప్రిల్ నుంచి పోస్ట్ పోన్ అయ్యి జూన్ కి వెళితే పరిస్థితి ఏమిటి, మెగా ఫ్యాన్స్ ఈ విషయమై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.