కియారా అద్వాణీ కెరీర్ బాలీవుడ్లో దేదీప్యమానంగా సాగిపోతుంది. వరుస విజయాలతో తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో బాలీవుడ్ లో చాలా కమిట్ మెంట్స్ ఉన్నాయి. వాటి వివరాలు కొత్త ఏడాదిలో రివీల్ చేయనుంది. మరి టాలీవుడ్ లో కియారా పరిస్థితి ఏంటి? అంటే ఒక్క మహేష్ తో తప్ప మరో స్టా ర్ తో ఇంత వరకూ తో హిట్ బొమ్మ పడలేదు. రామ్ చరణ్ తో నటించిన `వినయ విధేయ రామ`, `గేమ్ ఛేంజర్` రెండూ డిజాస్టర్లే.
ఆ తర్వాత మరే తెలుగు హీరోతో కూడా కలిసి నటించలేదు. అసలు అవకాశాలే రాలేదు. ఈ నేపథ్యంలో కియారా జర్నీ కొత్త ఏడాది నుంచి సరి కొత్తగాను ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. మునుపటిలా కథా బలం లేని సినిమాల కంటే బలమైన కథల్లోనే నటించాలని నిర్ణయించుకుంది. వేగంగా సినిమాలు చేయడం కంటే? మంచి కథలతో రెండు సినిమాలు చేసినా చాలు అనుకుంటుంది.
ప్రముఖంగా రామ్ చరణ్ తో నటించే ఛాన్స్ మళ్లీ వస్తే గనుక కమిట్ అవ్వడం కంటే? ముందుగా ఆ స్టోరీ ఎంత స్ట్రాంగ్ గా ఉందన్నది విశ్లేషించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకుంటాను? అన్నట్లు ఓ మీట్ లో అభిప్రాయపడింది. బాలీవుడ్ లో కూడా గతంలో ఎదురైన పరాభావల విషయంలోనూ అంతే సీరియస్ గా రివ్యూ చేసుకుంటున్నట్లు తెలి పింది. జయా పజయాలు సహజం అయినప్పటికీ నటిగా తానెంత వరకూ నిజాయితీ గల కథల్లో నటిస్తాను అన్న దానికి ప్రాధాన్యత ఇస్తానంది.
మొత్తంగా కియారా 2026 నుంచి భారీ మార్పులే తేబోతుందన్నది సుస్పష్టం. అలాగే అమ్మడి ఫ్యామిలీ లైఫ్ కూడా ఎంతో సంతోషంగా సాగిపోతుంది. సిద్దార్ధ్ మల్హోత్రా తో జీవితాన్ని పంచుకున్న కియారా ఇదే ఏడాది ఓ పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్..సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతోంది.