పాన్ ఇండియా స్టేటస్ ని అందుకున్న ప్రభాస్ ఒక డిజాస్టర్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చినందుకు ప్రభాస్ ఫ్యాన్స్ ఎంత నలిగిపోయారో అందరికి తెలుసు. చిన్న డైరెక్టర్ మారుతి ని ప్రభాస్ నమ్మడమేమిటి అనేది వారి బాధకు కారణం. కానీ ప్రభాస్ ఏ నమ్మకంతో మారుతీకి ఛాన్స్ ఇచ్చాడో అనేది రాజాసాబ్ ఫస్ట్ లుక్ తోనే మారుతి అభిమానుల ఒపీనియన్ మారేలా చేసాడు. అప్పటివరకు మారుతి ని ట్రోల్ చేసిన ఫ్యాన్స్ ఆతర్వాత మారుతిని నమ్మారు. ప్రభాస్ రాజసాబ్ లుక్ తోనే వారిలో మార్పొచ్చింది.
అప్పటివరకు మారుతి కూడా డైరెక్ట్ గా అప్ డేట్స్ ఇవ్వకుండా తన ట్విట్టర్ మిత్రులతో రాజసాబ్ స్టేటస్ పై అప్ డేట్స్ ఇచ్చేవారు. అయితే రాజాసాబ్ కంటెంట్ తో కూల్ అయిన అభిమానులను మారుతి మళ్లీ కెలుక్కున్నాడు. రాజసాబ్ ఈవెంట్ లో మారుతి ఎమోషనల్ అవడం ప్రభాస్ ఓదార్చడం, ప్రభాస్ మారుతి కి ఎలివేషన్ ఇవ్వడం అన్ని చూసి ఉబ్బి తబ్బిబ్బైన మారుతి ఫ్లో లో ప్రభాస్ ని మిడ్ రేంజ్ హీరో అంటూ చేసిన వ్యాక్యలపై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మిడ్ రేంజ్ హీరో అయిన ప్రభాస్ ని రాజమౌళి పాన్ ఇండియా స్టార్ ని చేసారు.. అందరూ రాజమౌళికి రుణపడి ఉండాలి అన్నాడు మారుతి.
అదిగో అదే అభిమానులకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. అప్పటికే ప్రభాస్ ఛత్రపతి, మిర్చి లాంటి బ్లాక్ బస్టర్స్ తో క్రేజీగా మారాడు. అంటూ వారు మారుతిపై మండి పడుతున్నారు. మరోపక్క మిడ్ రేంజ్ హీరో వ్యాఖ్యలను యాంటీ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తూ ట్రోల్ చేయడం చూసి ప్రభాస్ ఫ్యాన్స్ కి మారుతి పై మంటెత్తిపోతుంది.
రాజా సాబ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ పై ఇండైరెక్ట్ కామెంట్స్ చేసి అప్పుడు ఎన్టీఆర్ అభిమానులకు సారీ చెప్పిన మారుతి ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ని ఎలా కూల్ చేస్తాడో చూడాలి.