Advertisement
Google Ads BL

రాజాసాబ్- డ్యూటీ దిగిపోయిన ప్రభాస్


ద రాజ్ సాబ్ జనవరి 9 న విడుదలకు సిద్దమవుతుంది. సంక్రాంతి పోరులో మొదటి చిత్రంగా రాబోతుంది. రీసెంట్ గానే రాజసాబ్  ఈవెంట్ లో అభిమానుల సమక్షంలో ప్రభాస్ సందడి చేశారు. అయితే ఇకపై ప్రభాస్ రాజా సాబ్ ప్రమోషన్స్ లో కనిపించరు. రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయ్యింది, ప్రభాస్ రాజాసాబ్ డ్యూటీ దిగేసారు. 

Advertisement
CJ Advs

ఇక అంతా థమన్ దే బాధ్యత అన్నట్టుగా నిజంగానే మేకర్స్ పై భారం వేసి ప్రభాస్ విదేశాలకు చెక్కేస్తున్నారు. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం ప్రభాస్ ఇటలీ వెళ్ళబోతున్నారు. అక్కడ స్నేహితులతో కలిసి సంక్రాంతి వరకు ఎంజాయ్ చేసి ఆతర్వాత మళ్లి తిరిగి ఇండియాకి వస్తారని తెలుస్తుంది.  

సో స్పిరిట్ షూట్ కి బ్రేకిచ్చిన ప్రభాస్ రాజాసాబ్ ప్రమోషన్స్ లో కనిపిస్తారు అనుకుంటే జస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ముగించెయ్యడం అభిమానులను నిరాశ పరిచినా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనిపించడం కాస్త ఊరటనిచ్చింది. ఇదే ఉత్సాహాన్ని ఊపుని ఫౌజీ వరకు కొనసాగిస్తామని వారు మాట్లాడుకుంటున్నారు. సో ప్రభాస్ ఓ 15 రోజులు ఎవ్వరికి కనబడరన్నమాట. 

Raja Saab - Prabhas after finishing his duty:

Prabhas to take 15 days vacation
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs