బిగ్ బాస్ సీజన్ 9 లోకి ఎంటర్ అయిన కామన్ మ్యాన్ డిమోన్ పవన్-సెలెబ్రిటీ కోటాలో ఎంటర్ అయిన రీతూ చౌదరిలు హౌస్ లో లవ్ ట్రాక్ వేస్తె ఎక్కువగా ప్రొజెక్ట్ అయ్యి ఎక్కువ రోజులు హౌస్ లో ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. దానిలో భాగంగా ఇద్దరూ ప్రేమగా ఉండడం, తినిపించుకోవడం, గొడవలు పడడమే కాదు, టాస్క్ ల్లో ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకున్నారు.
కంటెంట్ పరంగా రీతూ-పవన్ లు బాగానే ఇచ్చారు కానీ.. ఒకరి వల్ల ఒకరి గేమ్ పోయింది. టాప్ 5 లో ఉంటుంది అనుకున్న రీతూ చౌదరి టాప్ 5 కి వెళ్లకుండానే ఎలిమినేట్ అయ్యింది, డిమోన్ పవన్ ఎలాగో టాప్ 3 లో కి వచ్చాడు. అయితే రీతూ-పవన్ లు కంఫర్ట్ జోన్ ఫ్రెండ్ షిప్ అని చెప్పుకున్నా దివ్వెల మాధురి, అయేషా లాంటి వాళ్ళు మీరు కావాలనే లవ్ ట్రాక్ వేసుకున్నారు అంటూ ముఖ్యంగా వారు రీతూ ని టార్గెట్ చేసారు.
ఇక రీతూ ఎలిమినేట్ అయ్యాక పవన్ కామెడీ వర్కౌట్ అయ్యింది, టాస్క్ ల్లో గెలిచాడు, టాప్ 3 కి వచ్చాడు. ఇక బయటికొచ్చాక వారు కలుస్తారా అనే అనుమానాలను రీతూ-పవన్ పటాపంచలు చేసారు. వారు హౌస్ లోనే కాదు బయట కూడా కలిసి కనిపిస్తున్నారు, ఈవెంట్స్ లో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. సో హౌస్ లోనే కాదు బయట కూడా వారి ఫ్రెండ్ షిప్ కంటిన్యూ అవుతుందన్నమాట.