హీరోయిన్లకు ప్రపోజ్ చేయని వారు ఎవరుంటారు. అందమైన హీరోయిన్లకు సోషల్ మీడియా వేదికగా రకరకాలుగా ప్రపోజ్ చేస్తుంటారు. ఎంతో ఓపెన్ గా మనసులో భావాలను చెబుతుంటారు. పాత రోజుల్లో ప్రేమ లేఖలు రాసేవారు. కానీ ఇప్పుడు ఇప్పుడా ప్రేమ లేఖలు సామాజిక మాధ్యమాలు వేదికగా క్షణాల్లోనే హీరోయిన్లకు చేరుతున్నాయి. వాటి గురించి ఏ హీరోయిన్ సీరియస్ గా తీసుకోదు అనుకోండి. లక్షల్లో లవ్ ప్రపోజల్స్ వెళ్తే? వాళ్లు మాత్రం ఎక్కడ చూడగలరు.
ఇదే అనుకున్నాడేమో ఓ అభిమాని. నిన్నటి రోజున జరిగిన `ది రాజాసాబ్` ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిధి అగర్వాల్ కు ఓ అభిమాని వింతగా లవ్ ప్రపోజ్ చేసాడు. అది చూసిన నిధి సహా పక్కనే ఉన్న ప్రభాస్ కూడా నిజమైన ప్రేమ పిపాసి అంటే ఇతడే ? అనిపించింది అన్నట్లు భావించారు. నిధి పాపను పెళ్లి చేసుకోవాలంటే? ఏ వృత్తిలో ఉండాలి? ఎంత ఆస్తి ఉండాలి? ఎలాంటి చదువు ఉండాలి? ఎంత అందంగా ఉండాలి? అంటూ ఓ ప్లకార్డు ప్రదర్శించాడు.
ఓ సామాన్యుడిలా నిధిని చేరుకోవడం అసాధ్యమని భావించి...నిధిని సాధించాలంటే? ముందు తానెలాంటివి సాధిస్తే నిధి అంగీకరిస్తుంది? అన్నది ప్లకార్డ్ ప్రదర్శన ఉద్దేశం. నిజంగా ఇది ఎంతో నిజాయితీతో కూడిన ప్రయత్నం..లవ్ ప్రపోజల్ గా చెప్పొచ్చు. అందుకే ప్రభాస్..నిధి అగర్వాల్ కూడా ఆ ప్లకార్డు ను చూసి ఎవరు ఈ ప్రేమ పిపాసి అనుకున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
నెటి జనుల నుంచి కూడా అతడికి మంచి మద్దతు లభిస్తుంది. నిధి అగర్వాల్ అతడి ప్రపోజల్ ను అంగీకరించాలి అంటూ సరదాగా పోస్టులు పెడుతున్నారు. మరి నిధి అగర్వాల్ మనసులో ఉద్దేశం ఏంటో? ఇటీవలే నిధి అగర్వాల్ ని ఓ షాపింగ్ మాలులో అభిమానులు చుట్టు ముట్టడంతో ఎంత ఇబ్బంది పడిందో తెలిసిందే. ఆ సంఘటన ఆ తర్వాత ఎలాంటి వివాదాలకు దారి తీసిందో కూడా విధితమే.