బాలీవుడ్ నటి కియారా అద్వాణీ వృత్తి..వ్యక్తిగత జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుంది. సినిమా...ఫ్యామిలీ లైఫ్ ని ఎంతో తెలివిగా బ్యాలెన్స్ చేస్తుంది. భర్త సిద్దార్ధ్ మల్హోత్రా కూడా నటుడే కావడంతో? ప్రోఫెషనల్ గా ఎలాంటి ఇబ్బందులు లేవు. ఒకరి కొకరు అర్దం చేసుకుని ముందుకెళ్లిపోతున్నారు. డే అంతా షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నా? సాయంత్రం ఇంటికి చేరుకునే సరికి షూటింగ్ టెన్షన్ ఏవీ ఇంటికి తీసుకు రాకుండా బయటే వదిలేసి వస్తున్నారు.
ఇటీవలే ఆ దంపతులకు ఈ ఏడాది ఓ బేబి కూడా జన్మించిన సంగతి తెలిసిందే. దీంతో సాయంత్రం్ నుంచి పాపతో ఆడుకోవడమే పనిగా పెట్టుకుంటున్నారు. తాజాగా కియార అద్వానీ తల్లి అయ్యాక తనలో వచ్చిన కొన్ని రకాల మార్పులు గురించి చెప్పుకొచ్చింది. మామ్ అయ్యాక తన శరీరాన్ని, అందాన్ని చూసే విధానమే మారిపోయిందంది. ఇటీవలే రిలీజ్ అయిన `వార్ 2` లో ని బికినీ షాట్ కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందని తెలిపింది.
సన్నగా మారిపోవ డంతో? శరీరానికి బికినీ పర్పెక్ట్ గా సూటవ్వక పోవడంతో కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కున్నట్లు గుర్తు చేసుకుంది. మొదట్లో ఉన్నంత అందంగా మళ్లీ కనిపించగలనా? అన్న సందేహం తనకే వచ్చిందంది. కానీ ఇక్కడ అందమైన శరీరం ముఖ్యం కాదని, ఓ మనిషిని సృష్టించాము అని తన శరీరాన్ని చూసినప్పుడల్లా ఎంతో గర్వపడతానంది.ప్రస్తుతం తాను చూడటానికి ఎలా ఉన్నా? తనని తాను ఎంతో గౌరవించుకుంటానంది.
ఒకప్పుడు ఇలాంటి ఆలోచనలన్నింటికీ భిన్నంగా తాను ఉండేదాన్ని,ఇవన్నీ తల్లి అయిన తర్వాత తనలో వచ్చిన మార్పులుగా చెప్పుకొచ్చింది. ఈ ఏడాది అమ్మడు `గేమ్ ఛేంజర్` సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమా కూడా అంచనాలు అందుకోలేదు. టాలీవుడ్ లో అమ్మడికి సెకెండ్ డిజాస్టర్ ఇది. అదే రామ్ చరణ్ తో గతంలో `వినయ విధేయ రామ`లో నటించిన సంగతి తెలిసిందే.