ఇటీవలే రిలీజ్ అయిన బాలీవుడ్ చిత్రం `ధురంధర్` ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల క్లబ్ లో చేరిన చిత్రమిది. 2025 ఏడాదికి ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ ఇదే. ఈ సినిమా దరిదాపుల్లో కూడా మరే సినిమా లేదు. రణవీర్ సింగ్ కెరీర్ కి సైతం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇదే. తొలి 1000 కోట్ల వసూళ్ల చిత్రం కూడా ఇదే. ఇక ఇదే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది రాజ్ అర్జున్ కుమార్తె సారా అర్జున్.
తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని అమ్మడు లాంచ్ అయింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభిచిన సారా అర్జున్ తొలి సినిమాతో రికార్డ్ హిట్ లో నిలిచింది. దీంతో ఈ సినిమా బాలీవుడ్ లో మరిన్ని మంచి అవకాశాలు తెచ్చి పెడుతుంది? అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ బ్యూటీకి టాలీవుడ్ లో ఇంకా ఛాన్సులు రాలేదా? అంటే ఇప్పటికే అమ్మడు తెలుగులో ఓ సినిమా కూడా చేస్తుంది? అన్నది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆ సినిమా గురించి పెద్దగా ప్రచార లేకపోవడంతో విషయం వెలుగులోకి రాలేదు. లేదంటే? ఆ సినిమాకు బిగ్గెస్ట్ అసెట్ గా నిలిచేది. ఇంతకీ ఏంటా సినిమా అంటే? వివరాల్లోకి వెళ్లాల్సిందే. గుణశేఖర్ స్వీయా దర్శక్వంలో `యూఫో రియా` అనే యూత్ ఫుల్ కాన్సెప్ట్ గో తో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసింందే. కొన్ని నెలలుగా ఈ సినిమా సెట్స్ లో ఉండగా ఎట్టకేలకు షూట్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.
ఈ సినిమాలో హీరోయిన్ గా సారా నటిస్తోంది. భూమిక, గౌతమ్ వాసుదేవ్ మేనన్ తో పాటు సారా కూడా సినిమాలో ఓ కీలక పాత్రధారి. కానీ ఈ సినిమాలో సారా నటిస్తోంది? అన్న విషయం బయట పెద్దగా ఎవరికీ తెలియదు. సినిమాకు సంబంధించి పెద్దగా ప్రచారం కూడా నిర్వహించడం లేదు. దీంతో సారా హైడ్ అవుతుంది. ఓ రకంగా సినిమాకు సారా ఎంతో ప్లస్ అవుతుంది `ధురంధర్` విజయంతో. కానీ టీమ్ ఆ రకంగా ప్రమోట్ చేయడం లేదు.