పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఛాన్స్ ఇచ్చినప్పుడు దర్శకుడు మారుతి ని ప్రభాస్ ఫ్యాన్స్ మాములుగా ట్రోల్ చెయ్యలేదు, ప్రభాస్ ఏమిటి మారుతి కి అవకాశం ఇవ్వడం ఏంటి అంటూ గోలెత్తిపోయారు, కానీ ద రాజసాబ్ ఫస్ట్ లుక్ తోనూ, ట్రైలర్ తోనూ ప్రభాస్ ఫ్యాన్స్ మారుతి దారిలోకి తెచ్చుకున్నారు, వారిని కూల్ చేసారు. అయితే మారుతి కి ఆ బాధ చాలా ఉంది.
తాజాగా రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టేజ్ పై మాట్లాడుతూ.. డార్లింగ్ నువ్వు చూస్తున్నప్పుడు మాట్లాడడం అంటే కష్టం అంటూ ఎమోషనల్ అవ్వగానే ప్రభాస్ స్పీడు గా స్టేజ్ పైకి వచ్చి దర్శకుడు మారుతి ని హగ్ చేసుకుని ఓదార్చారు, అయితే మారుతి రాజాసాబ్ ఈవెంట్ లో పెద్ద స్టేట్మెంట్ పాస్ చేసాడు.
ప్రభాస్ ను ప్రేమించే ఎవ్వరైనా సరే, వారిని గనక రాజాసాబ్ సినిమా వన్ పర్సంట్ డిస్సపాయింట్ చేసినా సరే, నా విల్లా కు రండి. నా విల్లా నెంబర్ 17, Kolla Luxuria, Kondapur అంటూ విల్లా నెంబర్ అడ్రస్ చెప్పిన దర్శకుడు మారుతిని చూసి రాజాసాబ్ అవుట్ ఫుట్ పై మారుతీ కి కాన్ఫిడెన్స్ వేరే లెవల్ అంటూ మాట్లాడుకుంటున్నారు.