చాలా రోజుల తర్వాత డార్లింగ్ ప్రభాస్ అభిమానుల ముందుకు వచ్చారు. నేడు శనివారం హైదరాబాద్ లో జరుగుతున్న ద రాజసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులను కొత్త లుక్ తో సర్ ప్రైజ్ చేసారు. హెయిర్ స్టయిల్ మార్చి పిలక వేసుకుని కొత్తగా ప్రభాస్ రాజాసాబ్ ఈవెంట్ లో కనిపించారు.
జనవరి 9 న రాజాసాబ్ తో సంక్రాంతికి బోణి కొట్టబోతున్న డార్లింగ్ ప్రభాస్ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీలో నటించడమే కాదు రీసెంట్ గానే సందీప్ వంగ దర్శకత్వంలో స్పిరిట్ సెట్ లో జాయిన్ అయ్యారు ప్రభాస్. స్పిరిట్ లో ప్రభాస్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు.
అందుకే ప్రభాస్ ఫిట్ గా పోలీస్ లుక్ కోసం మేకోవర్ అయ్యారు. ఇప్పుడు అదే లుక్ లో ప్రభాస్ రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనిపించడంతో ప్రభాస్ ఫ్యాన్స్ సర్ ప్రైజ్ అవుతూ ప్రభాస్ న్యూ లుక్ చూసి పండగ చేసుకుంటున్నారు. అంతేకాదు ప్రభాస్ కూడా స్పిరిట్ షూటింగ్ నుంచి డైరెక్ట్ గా ఈ ఈవెంట్ కి వచ్చినట్టుగా చెప్పడంతో ప్రభాస్ ఫ్యాన్స్ మరింత ఉత్సహంతో విజిల్స్ వేస్తూ కేరింతలు కొట్టారు.