ఈ ఏడాది కోలీవుడ్ లో సత్తా చాటుదామని వెయిట్ చేసిన కృతి శెట్టి కి నిరాశే ఎదురైంది. తెలుగులో ఆఫర్స్ తగ్గినా తమిళనాట కృతి శెట్టి కి రెడ్ కార్పెట్ పరిచారు. ఈ డిసెంబర్లో బ్యాక్ టు బ్యా సినిమాలతో కృతి శెట్టి తమిళ ఆడియన్స్ ముందుకు వస్తుంది అనుకుంటే.. ఆమె బ్యాడ్ లక్ ఈ నెలలో విడుదల కావాల్సిన రెండు సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి.
అందులో ఒకటి హీరో కార్తీ అన్నగారు వస్తారు, రెండోది ప్రదీప్ రంగనాధన్ LIK ఈ రెండు చిత్రాలు డిసెంబర్ లో విడుదల కావాల్సి ఉండగా టెక్నీకల్ రీజన్స్ తో పోస్ట్ పోన్ అయ్యాయి. అయినప్పటికీ కృతి శెట్టి డిజప్పాయింట్ అవ్వకుండా సోషల్ మీడియా వేదికగా గ్లామర్ ఫొటోస్, శారీ లుక్స్ షేర్ చేస్తూ హడావిడి చేస్తున్నది.
రెండు రోజుల క్రితం చీరకట్టులో మురిపించిన కృతి శెట్టి తాజాగా గ్లామర్ లుక్ లో మెస్మరైజ్ చేసింది. రెండు డిఫ్రెంట్ ఫొటోస్ తో కృతి శెట్టి గ్లామర్ ఫోజులతో అద్దరగొట్టేసింది. మీరు కృతి శెట్టి న్యూ పిక్స్ పై ఓ లుక్ వెయ్యండి.