నటుడు శివాజీ హీరోయిన్స్ దుస్తులపై చేసిన కామెంట్స్ ఆయన్ని ఇరకాటంలోకి నెట్టాయి. హీరోయిన్స్ దుస్తులపై, వారి వేషధారణపై చేసిన కామెంట్స్ కొంతమంది మహిళా మనోభావాలను దెబ్బతీస్తే, మరికొంతమంది మహిళలు శివాజీ వ్యాఖ్యలకు సపోర్ట్ చేస్తున్నారు. అనసూయ, చిన్మయి లాంటి శివాజీ పై ఫైర్ అవుతుంటే, మహిళా కమిషన్ శివాజీకి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచింది.
ఇక పబ్లిక్ అయితే శివాజీ ని సపోర్ట్ చేస్తున్నారు. చాలామంది మహిళలు శివాజీ చెప్పిన దానిలో తప్పేం ఉంది అంటే.. కొంతమంది మాత్రమే శివాజీ వ్యాఖ్యలను వ్యతిరేఖిస్తున్నారు. అయితే పురుషులు ముఖ్యంగా కొంతమంది నటులు శివాజీ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతున్నారు.
నటుడు కమ్ ఎమ్యెల్సీ నాగబాబు ఆడవారి వస్త్రాధారణపై కామెంట్స్ చేసే అర్హత ఎవరికీ లేదు, వారి వారి కంఫర్ట్ ని బట్టి వారి డ్రెస్సింగ్ స్టయిల్ ఉంటుంది అంటూ శివాజీ పై నాగబాబు ఫైర్ అయ్యారు. అంతేకాదు శివాజీ వ్యాఖ్యలను ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కూడా తప్పుబట్టారు.
ఆడవాళ్లు అంటే మీరు ఏమనుకుంటున్నారు.. ఆ భాష ఏంటి మీలో ఉన్నదేగా బయటకి వస్తుంది. ఆడవాళ్లపై అసలు ఆ మాటలేంటి, ఆ అహంకారం ఏంటి? తరతరాలుగా ఆడవాళ్లకి మగవాళ్ల నుంచే కదా అన్యాయం జరుగుతోంది. ఒక వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు నీకు సంస్కారం ఉండాలి అంటూ శివాజీ ని ప్రకాష్ రాజ్ కడిగిపడేసారు.