చాలా సినిమాలు ఏమిటి.. హిట్ సినిమా అయినా ప్లాప్ సినిమా అయినా థియేటర్స్ లో విడుదలైన నాలుగు వారాల్లోపే ఓటీటీ లో దర్శనమిస్తున్నాయి. నిర్మాతలు పైరసీ వల్ల సినిమా నష్టపోతోంది అంటూ గోల చేస్తున్నారు కానీ.. అసలు నష్టపోయేది ఓటీటీల వల్లే. సినిమాలు హిట్ అయిన నాలుగు వారాల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తుంటే ఇక థియేటర్స్ కు ఎవరు వెళతారు.
ఇప్పుడు తాజాగా ఓ ప్లాప్ సినిమా మూడు వారాలు లోపే ఓటీటీలోకి రావడం అందరికి షాకిచ్చింది. ప్రముఖ యాంకర్ సుమ కనకాల కొడుకు రోషన్ కనకాల నటించిన మోగ్లీ సినిమా డిసెంబరు 13న థియేటర్స్ లో రిలీజైంది. ఈ చిత్రానికి ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి వాళ్ళు సపోర్ట్ చేసారు, భారీగా మోగ్లీని రోషన్ కనకాల ప్రమోట్ చేసాడు.
కానీ సినిమా అనుకున్న అంచనాలు అందుకోవడం విఫలమైంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ డేట్ లాక్ చేసుకుంది, అది కూడా సినిమా థియేటర్స్ లో విడుదలైన మూడు వారాల్లోపే. జనవరి 1 న ఈటివి విన్ నుంచి రోషన్ కనకాల మోగ్లీ ఓటీటీ ఆడియన్స్ కి అందుబాటులోకి రానున్నట్లుగా అఫీషియల్ ప్రకటించారు.