చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా మారి కెరీర్ లో చాలా స్పీడుగా సక్సెస్ ని అందుకుని ఎలాంటి బ్యాక్ రౌండ్ లేకుండా హీరోగా ఎదుగుతున్న తేజ సజ్జా హనుమాన్, మిరాయ్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా హిట్ అందుకున్న తేజ సజ్జ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తాజాగా తేజ సజ్జా ఓ చిట్ చిట్ లో పాల్గొన్నాడు. అందులో తేజ సజ్జా చాలా విషయాలపై రియాక్ట్ అయ్యాడు.
ముఖ్యంగా హీరోలపై జరిగే ట్రోల్స్, తనపై జరిగే ట్రోల్స్ పై స్పందించాడు. స్టార్ హీరోలనే కాదు, పెద్ద పెద్ద హీరోలను కూడా ట్రోల్స్ చేస్తుంటారు. అంతెందుకు నేషనల్ అవార్డులు వచ్చిన చిత్రాలపై కూడా విమర్శలు చేస్తారు. వాళ్లు అలా విమర్శలు చేస్తున్నారు, ట్రోల్స్ చేస్తున్నారు అని మనం ఆలోచిస్తూ కూర్చుంటే అక్కడే ఆగిపోతాం, ముందుకు సాగలేం. టాలెంట్ ను నమ్ముకుంటూ కెరీర్లో ముందుకెళ్లాలి. మనం తప్పు చెయ్యకపోతే ఇప్పుడు కాకపోతే 10 ఏళ్ల తర్వాత అయినా అసలు నిజాలు బయటికొస్తాయి.
మనం ప్రేక్షకులను కొత్త కథలతో ఎలా అలరించాలి అనే ఆలోచించాలి. మనకంటూ గుర్తింపు వచ్చిన తర్వాత నాకు సినీ బ్యాక్ రౌండ్ లేకుండా ఇక్కడ దాకా వచ్చాను అని చెప్పడం కంటే ఆడియన్స్ వల్లే ఈ స్థాయిలో ఉన్నా అని చెప్పాలి. కారణం ఏమిటంటే.. బ్యాక్ రౌండ్ ఉన్న వారసులకు ఒత్తిడి, ఇబ్బందులు ఉంటాయి. ఒక్కసారే స్టార్ హీరో అవ్వాలని సినిమాలు చెయ్యకూడదు.
ఆచి తూచి ఆడియన్స్ కు నచ్చే సినిమాలు చేసుకుంటూ హీరోగా ఎదగాలి. మనతో సినిమా చేస్తే మినిమమ్ గ్యారెంటీ అని ప్రొడ్యూసర్ అనుకునేలా మనం ఎదగాలి, చాలామంది అలా ఎదిగినవారే అంటూ తేజ సజ్జా ఆ చిట్ చాట్ లో చాలా విషయాలను షేర్ చేసుకున్నాడు.