మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతము ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. రీసెంట్ గా పెద్ది ఢిల్లీ షెడ్యూల్ ముగించి వచ్చిన రామ్ చరణ్ ఈ చిత్రంలో జాన్వీ కపూర్ తో రొమాన్స్ చేస్తున్నాడు. చికిరి చికిరి సాంగ్ లో రామ్ చరణ్-జాన్వీ పెయిర్ ని మెగా ఫ్యాన్స్ చాలా ఎంజాయ్ చేసారు.
ఇక రామ్ చరణ్ పెద్ది చిత్రంతో తర్వాత పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ తో RC 17 ప్రాజెక్ట్ అనౌన్స్ చేసారు. ఈ చిత్రం స్క్రిప్ట్ పై సుకుమార్ వర్క్ చేస్తున్నారు. మార్చి లో పెద్ది విడుదల కాగానే ఏప్రిల్ నుంచి చరణ్ సుకుమార్ తో కలిసి సెట్ మీదకి వెళతారని తెలుస్తుంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ని దర్శకుడు సుక్కు ఫైనల్ చేసినట్లుగా తెలుస్తుంది.
కన్నడ సన్సేషన్, కాంతార 2తో పాన్ ఇండియా మార్కెట్ లో క్రేజీ హీరోయిన్ గా మారి, ప్రస్తుతం ఎన్టీఆర్, యష్ లాంటి పాన్ ఇండియా స్టార్స్ తో మూవీస్ చేస్తున్న రుక్మిణి వసంత్ RC17 లో రామ్ చరణ్ తో రొమాన్స్ చేయబోతుంది అనే వార్త ఇప్పుడు కన్నడ నుంచి టాలీవుడ్ వరకు సంచలనంగా మారింది, మరి సుక్కు రుక్మిణి వసంత్ ని చరణ్ కోసం ఫైనల్ చేస్తారో లేదో చూడాలి.