బాలీవుడ్ గత కొంతకాలంగా విజయాల కోసం పరుగులు పెడుతుంది. సౌత్ లో తెరకెక్కి పాన్ ఇండియా మార్కెట్ ను కొల్లగొడుతున్న సినిమాలను చూసి బాలీవుడ్ కిందా మీదా పడింది. ఈ ఏడాది ప్రధమార్ధంలో ఛావా బాలీవుడ్ లో భారీ విజయాన్ని నమోదు చెయ్యగా మధ్యలో సయ్యారే లాంటి చిన్న చిత్రం దున్నేసింది. బాలీవుడ్ కి ఈ ఏడాది ముగింపు మాత్రం భారీ హిట్ తో ఉండబోతుంది.
అది కూడా రూ.1000 కోట్లతో బాలీవుడ్ 2025 ని ముగించబోతుంది. రణవీర్ సింగ్ లేటెస్ట్ మూవీ ధురంధర్ ఏంతో నెగిటివిటీని దాటుకుని రూ.1000 కోట్ల క్లబ్బులోకి ఎంటర్ అయ్యింది. మూడో వారంలోను ధురంధర్ దూకుడు ఏమాత్రం తగ్గలేదు. దేశవ్యాప్తంగా ఈ చిత్రం రూ.668.80 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా, వరల్డ్ వైడ్ గా మాత్రం రూ.1006.7 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసి అందరికి ముఖ్యంగా సౌత్ కి బిగ్ షాక్ ఇచ్చింది.
ఆదిత్య ధార్ దర్శకత్వంలో తెరకెక్కిన ధురంధర్ లో రణ్‌వీర్ సింగ్‌తో పాటు సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, సారా అర్జున్ వంటి స్టార్ నటులు కీలక పాత్రలు పోషించారు. మరి బాలీవుడ్ ఈ ఏడాది ధురంధర్ విజయంతో, రూ.1000 కోట్ల కలెక్షన్స్ తో ముగించేందుకు సిద్దమైంది. మరో వారం ఇదే దూడుకు ధురంధర్ చూపిస్తే కలెక్షన్స్ మరింతగా పెరిగే అవకాశం అయితే లేకపోలేదు.