ఈ ఏడాది బలిసి చాలా నిర్ణయాలు తీసుకుని నష్టపోయాను అంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో నష్టపోయిన నిర్మాత నాగవంశీ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. ఈ ఏడాది తొడ కొట్టి మరీ కాన్ఫిడెంట్ గా అభిమానులను రెచ్చగొట్టే లా మాట్లాడిన నిర్మాత నాగవంశీకి ఎన్టీఆర్ వార్ 2తోనూ, కింగ్ డమ్, మాస్ జాతర బ్యాక్ టు బ్యాక్ షాకిచ్చాయి.
ఏ సినిమా ఎలా పోయినా వార్ 2 తో నాగవంశీ ఇంత నష్టపోయాడు, అంత నష్టపోయాడు, దేవర చిత్రంతో ఎలాగో బయటపడిన నాగవంశీ కి వార్ 2 దెబ్బేసింది. ఆఖరికి ఆస్తులను కూడా తాకట్టు పెట్టె పరిస్థితి కి వచ్చేశాడంటూ యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో నాగవంశీ ని తెగ ట్రోల్ చేసారు. తాజాగా ఆ ఇంటర్వ్యూ లో నాగవంశీ వార్ 2 నష్టాల అసలు విషయాన్ని బయటపెట్టారు.
వార్ 2 కి తను నష్టపోయింది చాలా తక్కువ అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. వార్ 2ను అంతకు కొన్నానని, ఇంత నష్టపోయానని చాలా ప్రచారం జరిగింది. అసలు వార్ 2 ను నేను తెలుగు స్టేట్స్ హక్కులు కొన్నది జీఎస్టీ కాకుండా 68 కోట్లు. వార్ 2 ప్రొడ్యూసర్ యశ్ రాజ్ వాళ్లు రిలీజ్‌కు ముందే జీఎస్టీ ఇచ్చేశారు. ఈ సినిమా 35-40 కోట్ల మధ్య షేర్ చేసింది.
సినిమా రిలీజ్ అయ్యాక డివైడ్ టాక్ వచ్చి తర్వాత సినిమాకు నష్టం వచ్చిందని.. దానితో నన్ను ముంబై కి పిలిచి మరీ యశ్ రాజ్ వాళ్లే 18 కోట్లు నాకు వెనక్కి ఇచ్చారు.. సో నేను వార్ 2 కొని నష్టపోయింది చాలా తక్కువ అంటూ నాగవంశీ వార్ 2 నష్టాలపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసారు.