మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కి సౌత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. తెలుగు, తమిళ, కన్నడ ఏ భాష అయినా మోహన్ లాల్ ని ఇష్టపడని ప్రేక్షకులు ఉండరు. అందులోను ఈ ఏడాది మలయాళ ఇండస్ట్రీలో మోహన్ లాల్ భారీ సక్సెస్ లను నమోదు చేసారు. L2 ఎంపురాన్, తుడురం లాంటి భారీ విజయాలను సొంతం చేసుకున్నారు.
ఇక తాజాగా 2025 ఎండింగ్ లో క్రిష్టమస్ సందర్భంగా మోహన్ లాల్ నటించిన వృషభ చిత్రాన్ని పాన్ ఇండియా మర్కెట్ లో విడుదల చేసారు. విడుదలకు ముందు భారీ అంచనాలునం ఈ చిత్రానికి విడుదలయ్యాక ప్రేక్షకుల టాక్, క్రిటిక్స్ ఇచ్చిన రేటింగ్స్ చూసి షాకవుతున్నారు. వృషభ చిత్రానికి విమర్శకులు పూర్ రివ్యూస్, రేటింగ్స్ ఇచ్చారు.
మోహన్ లాల్ చిత్రానికి ఇలాంటి టాకా, ఇలాంటి రేటింగ్సా అంటూ ఆశ్చర్యపోతున్నారు. చాలామంది వెబ్ సైట్స్ వారు వృషభ చిత్రానికి 1, 1.5, 1.75, 2 రేటింగ్స్ ఇవ్వడం చూసిన వారు మోహన్ లాల్ చిత్రానికి ఇలాంటి రేటింగ్స్ ఏమిటి, ఈ చిత్రంపై ఆయన రెస్పాన్స్ ఎలా ఉంటుందో అంటూ మాట్లాడుకుంటున్నారు.