ఈ ఏడాది పవర్ ఫుల్ స్టేట్మెంట్స్ ఇచ్చి చతికిల పడిన నిర్మాత నాగవంశీ ఈసారి మళ్ళీ 2026 లో బోణి కొట్టబోతున్నాం, ఖచ్చితంగా 99.99% హిట్ కొట్టడం గ్యారంటీ అంటూ మరోసారి మీడియా ముందు స్టేట్మెంట్ ఇచ్చాడు. వార్ 2, ఆ తర్వాత కింగ్ డమ్ ఆ తర్వాత మాస్ జాతర విషయంలో నాగవంశీ చాలా కాన్ఫిడెంట్ గా అభిమానులకు హామీ ఇచ్చాడు.
అటు ఎన్టీఆర్ వార్ 2 ఇటు విజయ్ దేవరకొండ కింగ్ డమ్ , రవితేజ మాస్ జాతర మూడు సినిమాలు నాగవంశీ కాన్ఫిడెన్స్ పై నీళ్లు చల్లాయి. మూడు సినిమాలు నాగవంశీని ముంచేసాయి. ఇకపై నావంశీ ఎలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వరు అనుకుంటే.. అనగనగా ఒక రాజు తో ధైర్యం తెచ్చుకుని అభిమానులకు హామీ ఇస్తున్నాడు.
నా కాన్ఫిడెన్స్ అనగనగ ఒక రాజు చూసాక కొంచెం ధైర్యం తెచ్చుకున్నాను, 99.99% హిట్ కొడతాం ఇది గ్యారంటీ. 2025 ఫస్ట్ హాఫ్ లో ఉన్న వంశీ అయితే నా స్టైల్ లో చెప్పే వాడిని.. ఇప్పుడు 2025 సెకండ్ హాఫ్ లో ఉన్నా కాబట్టి తగ్గి చెప్తున్నా. ఆ వంశీ మళ్లీ సంక్రాంతి తర్వాత బయటకు వస్తాడు అంటూ నాగవంశీ నవీన్ పోలిశెట్టి తో అనగనగ ఒక రాజు గ్యారెంటీ హిట్ కొడుతున్నాం అంటూ అంచనాలు పెంచేసాడు.