మెగా ఫ్యామిలోకి బుల్లి వారసుడు వచ్చాడు. హీరో రామ్ చరణ్ కి ముందుగా అమ్మాయి క్లింకార జన్మిస్తే.. వరుణ్ తేజ్ కి ఈ ఏడాది అబ్బాయి పుట్టాడు. మెగా వారసుడిగా మెగా ఫ్యామిలోకి అడుగుపెట్టిన వరుణ్ తేజ్-లావణ్య లు తమ కొడుకు వాయువ్ తేజ్ తో స్పెండ్ చేసే ప్రతి మూమెంట్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.
రీసెంట్ గా కొడుకు మూడో నెల సెలబ్రేషన్స్ కోసం వరుణ్ తేజ్ స్వయంగా కేక్ ని ప్రిపేర్ చేసిన వీడియో షేర్ చేశారు. తాజాగా కొడుకు వాయువ్ తో కలిసి వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిలు ఈ క్రిస్మస్ ని సెలెబ్రేట్ చేసుకున్నారు. కొడుకు వాయువ్ ని ఎత్తుకుని క్రిస్మస్ ట్రీ దగ్గర వరుణ్ తేజ్ ముద్దాడుతుంటే లావణ్య పక్కనే ఉండి ఆనందిస్తున్న పిక్ ని షేర్ చేసారు.