Advertisement
Google Ads BL

పతంగ్‌ టీమ్‌ను అభినందించిన త్రివిక్రమ్‌


సినీ పరిశ్రమలో నూతన టాలెంట్‌ ఎక్కడా కనిపించినా కొంత మంది దర్శకులు, హీరోలు ఆ టీమ్‌ క్రియేటివిటిని, వర్క్‌ను అభినందిస్తుంటారు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో ఒకరు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌. ఇటీవల పతంగ్‌ సినిమా ట్రైలర్‌ను, ఆ టీమ్‌ చేస్తున్నప్రమోషన్‌ కంటెంట్‌, ఆ సినిమా కాన్సెప్ట్‌ గురించి విని ఇంప్రెస్‌ అయిన త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఆ టీమ్‌ను పిలిచి అభినందించడంతో పాటు టీమ్‌కు తన బెస్ట్ విషెస్‌ అందజేశాడు. 

Advertisement
CJ Advs

పతంగుల పోటీ నేపథ్యంలో ఇలాంటి కాన్సెప్ట్‌తో సౌత్‌ ఇండియాలోనే మొదటిసారిగా మీ టీమ్‌ చేస్తున్న ప్రయత్నం విజయవంతం కావాలని ఆయన కోరుకున్నారు.నాకెందుకో ఈ సినిమా ఆడుతుందని అనిపిపిస్తుంది అని త్రివిక్రమ్‌ గారు ఎంతో పాజిటివ్‌గా  మాట్లాడటంతో పతంగ్‌ టీమ్‌ ఎంతో ఎనర్జీతో ఉంది. త్రివిక్రమ్‌ను కలిసిన వారిలో పతంగ్‌ హీరోలు వంశీ పూజిత్‌, ప్రణవ్‌ కౌశిక్‌, దర్శకుడు ప్రణీత్‌ పత్తిపాటి కాస్ట్యూమ్‌ డిజైనర్‌ మేఘన శేషవపురి, చిత్ర నిర్మాతల్లో ఒకరైన రిషాన్‌ సినిమాస్‌ అధినేత సంతప్‌ మాక, చిత్ర విఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌ అండ్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ నిఖిల్‌ కోడూరు తదితరులు ఉన్నారు.  

ప్రముఖ నిర్మాత డి.సురేష్‌ బాబు సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రం సినిమాటిక్ ఎలిమెంట్స్ , రిష‌న్ సినిమాస్, మాన్‌సూన్‌ టేల్స్‌ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి.  ఈ స్పోర్ట్స్‌ డ్రామా ఈ చిత్రానికి విజ‌య్ శేఖ‌ర్ అన్నే, సంప‌త్ మకా  , సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మాతలు. పాపులర్‌ దర్శకుడు నటుడు గౌతమ్‌ వాసుదేవ మీనన్‌, ప్ర‌ముఖ సింగ‌ర్, న‌టుడు ఎస్‌పీ చ‌ర‌ణ్ ఈ చిత్రంలో కీల‌క‌మైన పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. ఈ రోజు క్రిస్‌మస్‌ కానుకగా విడుదలైన ఈ చిత్రం యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా మంచి రెస్పాన్స్‌ను రాబట్టుకుంది.

Trivikram congratulated the Patang team:

Trivikram Congratulates the Patang Team
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs