ఫుల్ కాంపిటీషన్ లో శర్వానంద్ సంక్రాంతికి చాలా కాన్ఫిడెంట్ తో రాబోతున్నాడు. నారి నారి నడుమ మురారి తో జనవరి 14 న భోగి రోజున సందడి చెయ్యడానికి ఉత్సాహపడుతున్నాడు. నారి నారి నడుమ మురారి చిత్ర ప్రమోషన్స్ స్టార్ట్ చేసాడు. ప్రస్తుతం మీడియా, సోషల్ మీడియాలో సంక్రాంతి సినిమాల జోరులో ఈ నారి నారి కూడా తోడైంది.
అయితే సంక్రాంతికి నారి నారి నడుమ మురారి చిత్రం హడవిడి చూసిన వారు ఎప్పుడో డిసెంబర్ 6 న రిలీజ్ అన్న శర్వా బైకర్ ఏమయ్యింది అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 6 శర్వానంద్ బైకర్ రిలీజ్ అంటూ మేకర్స్ అనౌన్స్ చేసి అఖండ2 తాండవం దెబ్బకి వెనక్కి తగ్గారు.
ఆ తగ్గడం తగ్గడం ఇప్పటికి ముందుకు రావడమే లేదు. అసలు శర్వానంద్ బైకర్ స్టేటస్ ఏమిటో తెలియక ఆయన అభిమానులు డిజప్పాయింట్ అవుతున్నారు. అటు నారి నారి నడుమ మురారి ప్రమోషన్స్ తో ఎంజాయ్ చేస్తున్నా బైకర్ ముచ్చట్లు తెలియడం లేదు అనే ఆందోళన కూడా ఉంది. మరి శర్వానంద్ నారి నారి ప్రమోషన్స్ లో ఏమైనా బైకర్ అప్ డేట్ ఇస్తాడేమో చూడాలి.